కేంద్ర మంత్రిని కలిసిన ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సస్పెండ్- అసలు కారణం ఏంటి..!?
ఢిల్లీ పర్యటన ముగ్గురు ఉపాధ్యాయుల పై సస్పెన్షన్ వేటుకు కారణమైంది. కడప జిల్లాలో ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా మారింది. కడప జిల్లాకు చెందిన ఒక బృందం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసింది. ఆ సమయంలో సర్వీసులో ఉన్న వారికి టెట్ మినహాయించాలి అని కోరింది. అయితే, ఈ ఉపాధ్యాయులు డీఎస్సీ అక్రమాల పై ఫిర్యాదు చేసారంటూ.. సస్పెండ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు మాత్రం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం వీరు కేంద్రమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు.
కడప జిల్లాలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇటీవల ఓ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి మద్దతుగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి కొందరు టీచర్లు ఇదే అంశం పైన మాజీ సీఎం జగన్ ను కలిసారు. రాష్ట్రంలో ఇదే సమయంలో డీఎస్సీ లో అక్రమాల పైన రాజకీయ పోరాటం సాగుతోంది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ మద్దతు దారులు... పొరపాట్లు జరగలేదని చెబుతూ డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాధ్యాయులు వైసీపీ ఎంపీల మద్దతు తో కేంద్ర మంత్రిని కలిసారు. తమ అభ్యర్ధనల పైన వినతి పత్రం సమర్పించారు.

టెట్ పైనే కలిసామంటున్న ఉపాధ్యాయులు
కాగా, మెగా DSC ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఇటీవల ఒక ప్రతినిధి బృందం దిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రిని స్వయంగా కలిసి వీరు ఫిర్యాదు చేసారనే వాదన ఉంది. రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు వీరిని సస్పెండ్ చేసినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లె మండలం రాజీవ్ నగర్ MPPS ఉపాధ్యాయుడు ఎస్. అమరనాథ రెడ్డి, పులివెందుల మండలం అహోబిలాపురం MPPS ఉపాధ్యాయుడు సి. వెంకటనాథ రెడ్డి, వేంపల్లె మండలం భారతి MPP పాఠశాల ఉపాధ్యాయుడు ఎన్. సంగమేశ్వర రెడ్డిలను DEO షంషుద్దీన్ సస్పెండ్ చేశారు. అయితే, తాము డీఎస్సీ గురించి మాట్లాడలేదని.. డీఎస్సీకి సంబంధించిన ఎలాంటి వినతిపత్రం కూడా సమర్పించలేదని.. ఇలా సస్పెండ్ చేయడం సరికాదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.













Click it and Unblock the Notifications