వచ్చే 2 రోజులు జాగ్రత్త, రికార్డు ఉష్ణోగ్రతలు-ఎల్ నినో ఎఫెక్ట్.. తాజా హెచ్చరిక..!!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం కారణంగా రాష్ట్రం లో వర్షం పడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయని అలర్ట్ చేస్తోంది. పలు జిల్లాలకు తాజా హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణ పై ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్ లోనూ వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా నాలుగు డిగ్రీల మేర పెరిగినట్లు వివరించింది. అదే విధంగా రానున్న రెండు రోజుల్లో మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణంగా 31.8 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత, ఆదివారం నాటికి 34 డిగ్రీలకు చేరుకుంది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
కాగా.. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి 'ఎల్‌నినో' (El Nino) ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అయితే, గత వారం ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. కాగా, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరో వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్న వేళ... వాతావరణ శాఖ పెరుగుతున్న ఉష్ణోగ్రతల పైన అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications
