థర్డ్ లాంగ్వేజ్ పై సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం: సీబీఎస్ఈకి ఆదేశాలు

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ ఉపశమనం కలిగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన థర్డ్ లాంగ్వేజ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏడో తరగతి, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అమలులో ఉన్న బోర్డు పరీక్ష మినహాయింపులను ఇప్పుడు ఆరో తరగతికి కూడా పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని సీబీఎస్‌ఈ బోర్డును ఆదేశించింది.

ఈ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యా ప్రణాళికలో భాగంగా మూడో భాషను పాఠ్యాంశంగా ఖచ్చితంగా అభ్యసించాల్సి ఉంటుంది గానీ వారు భవిష్యత్తులో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసేటప్పుడు ఈ నిర్దుష్ట థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పరీక్ష రాయడం నుంచి వారికి బోర్డు పూర్తి మినహాయింపు ఇస్తుంది. ఇప్పటికే ఉన్నత తరగతుల విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని కోర్టు ఇప్పుడు ఆరో తరగతి విద్యార్థులకు కూడా విస్తరింపజేసింది.

Supreme Court Extends Exemption CBSE Class 6 Students Get Relief From Mandatory Third Language

సుప్రీంకోర్టు ఆరో తరగతి విద్యార్థులకు మరో కీలక సడలింపును కూడా ఇచ్చింది. ప్రస్తుతం రెండు స్థానికేతర భాషలను అభ్యసిస్తున్న విద్యార్థులు, తమ ప్రస్తుత సబ్జెక్టులను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సబ్జెక్టులను అలాగే కొనసాగిస్తూ థర్డ్ లాంగ్వేజ్ కింద ఏదైనా ఒక భారతీయ భాషను ఎంచుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. దీనివల్ల విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను వదులుకోవాల్సిన పని లేదు.

మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్
మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్

నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోన్న తరుణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది. సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంలో వచ్చిన ఈ తాజా మార్పులతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలకు, విద్యార్థులకు విద్యా ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయినట్టవుతుంది. థర్డ్ లాంగ్వేజ్ ఎంపిక, పరీక్షల విషయంలో మరింత స్పష్టత లభించినట్టయింది.

యూపీఐ ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం: ఆర్బీఐ + కేంద్రానికి తక్షణమే.. !!
యూపీఐ ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం: ఆర్బీఐ + కేంద్రానికి తక్షణమే.. !!

దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఈ మార్గదర్శకాలు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి. నూతన విద్యా సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులపై పడే ఒత్తిడిని నివారించడానికి సుప్రీంకోర్టు ఈ కీలక సడలింపులు ఇచ్చింది. ఈ తాజా ఆదేశాలకు అనుగుణంగా తగిన అధికారిక నిబంధనలు, నూతన మార్గదర్శకాలను సీబీఎస్‌ఈ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+