"ఉప ఎన్నికలు అయితే ఏంటి ?"- 18వేల అప్పీళ్లపై సుప్రీం షాకింగ్ నిర్ణయం..!

దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ( SIR) సందర్బంగా కోట్ల మంది పేర్లు గల్లంతవుతున్నాయి. వీటిపై ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో జనం అప్పీళ్లు చేస్తున్నారు. అయితే ఈ అప్పీళ్ల విచారణ పూర్తి కావాలంటే దశాబ్దానికి పైగా పడుతుందని ఇప్పటికే అంచనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లోనూ గత ఎన్నికలకు ముందు ఈసీ నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సందర్బంగా గల్లంతైన పేర్లపై 18 వేల అప్పీళ్లు ట్రైబ్యునల్స్ ముందు దాఖలయ్యాయి. వీటిపై విచారణకు 12 ఏళ్లు పడుతుందని తేలిపోయింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు.

కోర్టులు కాదు.. ఇక తేల్చాల్సింది ప్రజలే ..! సీఈసీపై కాక్రోచ్ లు ఫిక్స్..!
కోర్టులు కాదు.. ఇక తేల్చాల్సింది ప్రజలే ..! సీఈసీపై కాక్రోచ్ లు ఫిక్స్..!

మరోవైపు అక్టోబర్ 6న రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్ధానాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చోట్లా గల్లంతైన ఓట్లపై ఓటర్లు గతంలోనే సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ ఒకసారి ఓటు పోతే ఏమైంది, వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు కదా అంటూ చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ 18 వేల అప్పీళ్లపై ఉప ఎన్నికల్లోపు విచారణ జరపాలన్న పిటిషన్ పై విచారణ జరిపింది.

Bengal SIR Supreme Court Declines Early Hearing Before October 6 Bypolls Keeps Matter for October 5
షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..!
షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..!

అనంతరం రెజీనగర్, నందిగ్రామ్‌లలో అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికలకు ముందే ఈ అప్పీళ్లపై విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరినప్పటికీ అంగీకరించలేదు. ఈ అప్పీళ్లపై ముందుగానే విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.బాధిత ఓటర్లు రెండోసారి కూడా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొనగా.. "ఇవి కేవలం ఉప ఎన్నికలు మాత్రమే, అంతే" అని న్యాయమూర్తి సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారం అక్టోబర్ 5న విచారణ జాబితాలో యథాతథంగా లిస్ట్ కాబోతోంది. అంటే ఉప ఎన్నికలకు ఒక్క రోజు ముందు అన్న మాట. ఆరోజు సుప్రీం ప్రతికూల తీర్పు ఇస్తే లేదా విచారణ వాయిదా వేస్తే.. ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వీరంతా.. తిరిగి ఉప ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు వీల్లేగుండా పోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+