Danam Nagender: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పై నిన్న హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 91 పేజీల తీర్పును వెల్లడించింది. అలాగే 2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత అమల్లోకి వచ్చినట్లు తన తీర్పులో హైకోర్టు పేర్కొంది. దాంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దానం నాగేందర్.ఇక ఈ పిటిషన్ ఎల్లుండి పరిశీలనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే అంతకుముందు హైకోర్టు తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తీర్పును స్వాగతిస్తున్నానని.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అంతేకాక ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు తనకు కొత్త కాదని.. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తాను రెడీ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకూ తాను యుద్ధం చేసే వచ్చాని.. మరోసారి యుద్ధం కొత్తకాదని ఆయన స్పష్టం చేశారు. కానీ తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో BRS ఇప్పటికే అప్రమత్తమైంది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ను దాఖలు చేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి BRS అభ్యర్థిగా దానం నాగేందర్ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఆ పార్టీలో చేరారు. ఈనేపథ్యంలో దానం నాగేందర్ పై BRS పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ మేరకు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. హైకోర్టు నిర్ణయాన్ని బీఆర్ ఎస్, బీజేపీ నేతలు స్వాగతించారు.












Click it and Unblock the Notifications
