'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఊహించని గెస్ట్..! ఫ్యాన్స్ కు పండగే..
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'.. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. సెప్టెంబర్ 23న తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో నాని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ప్యారడైజ్ మూవీ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అలాగే మూవీ రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలుగా ఉంది. ఇక ప్యారడైజ్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఆయా షేర్, ఏషనాగుల పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అటు నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఫస్ట్ మూవీ దసరా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దసరా మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో నాని నటన అద్భుతమే అని చెప్పాలి.
ఇప్పుడు ప్యారడైజ్ మూవీలోనూ నాని మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రలో నటించారు. దాంతో సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో సెప్టెంబర్ 21 న గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అటు మెగా ఫ్యాన్స్ తో పాటు నాని ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాకా మూవీలో బిజీగా ఉన్న చిరంజీవి. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల చిత్రంలో ఓ సినిమా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఈ ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి చిత్ర బృందాన్ని ఆశీర్వదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్యారడైజ్ మూవీ ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా నాని వెల్లడించడం విశేషం. ఇలా ట్రైలర్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్లలోకి సినిమా అంటే డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. అయితే కథలో కంటెంట్ ఉంటే ట్రైలర్ తో సంబంధం లేదు అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్యారడైజ్ మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ట్రైలర్ అవసరం లేదని మూవీ టీమ్ భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో నాని సరసన హీరోయిన్ గా కయాదు లోహర్ నటించింది. అలాగే కీర్తి సురేశ్ ఏషనాగుల పాటలో డ్యాన్సులతో ఇరగతీసింది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీలో మాలిక్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
