జన్వాడ ఫామ్‌హౌస్ కేటీఆర్‌ది కాదా..? కాంగ్రెస్ నేతల పరిశీలనలో తేలిందేంటి..!!
బీఆర్ఎస్ ముఖ్య నేతల భూములు.. నిర్మాణాల చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీ వేదిక గా సీఎం రేవంత్ కీలక అంశాలను బయట పెట్టారు. కేసీఆర్ ఫాం హౌస్ భూముల పైన విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కనిపిస్తోంది. కాగా.. కాంగ్రెస్ నేతలు జన్వాడ లోని ఫామ్ హౌస్ ను సందర్శించారు. కీలక అంశాలను వెల్లడించారు. ఫాం హౌస్ కేటీఆర్ ది కాదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేసారని నేతలు తేల్చారు.
జన్వాడ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌస్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన పర్యటన ఉత్కంఠకు దారితీసింది. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ ఆస్తి అని, అసలు నిజాలు నిగ్గుతేలుస్తామని కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. ఇది కేటీఆర్ ది కాదని, లీజు ప్రాపర్టీ మాత్రమేనంటూ అసలైన యజమాని తెరపైకి రావడం ఈ వివాదాన్ని సరికొత్త మలుపు తిప్పింది.
ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతులు లేవని, నాలాపై ఫాంహౌస్‌ను కట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫాంహౌస్ భూములను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అయితే.. జన్వాడ ప్రాపర్టీ అసలు యజమానిని తానేనంటూ ప్రదీప్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆ స్థలానికి కేటీఆర్‌కు నేరుగా ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు. జన్వాడలోని ఈ 4 ఎకరాల భూమి పూర్తిగా తన స్వార్జితమని వెల్లడించారు.
2019లో చట్టబద్ధమైన ప్రక్రియలు, రిజిస్ట్రేషన్ నిబంధనలన్నీ పూర్తి చేసి ఈ భూమిని కొనుగోలు చేశానని, దీనికి సంబంధించి నూటికి నూరు శాతం చట్టబద్ధమైన టైటిల్ పత్రాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడు కావడంతో నిబంధనల ప్రకారమే లీజుకు మాత్రమే ఇచ్చానని, ఇక్కడ ఎలాంటి అక్రమాలు లేదా భూ ఆక్రమణలు జరగలేదని తేల్చిచెప్పారు.

కాగా.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. అక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే జన్వాడ ఫాంహౌస్‌కు వచ్చామని తెలిపారు. ఫాంహౌస్‌ను నాలాపై కట్టారని.. దీని నిర్మాణానికి అనుమతులు లేవన్నారు. ఫాంహౌస్ ఎవరి పేరుపై ఉందో స్పష్టత లేదని పేర్కొన్నారు. కేటీఆర్ స్నేహితుడే ప్రదీప్‌రెడ్డి అని.. ఆయనకు ఫాంహౌస్ భూమి ఎలా వచ్చిందని నిలదీశారు. సత్యం రామలింగరాజు భూముల్లో ఫాంహౌస్ నిర్మించారని తెలిపారు.














Click it and Unblock the Notifications
