సడెన్ గా ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు..!
తెలుగులో హారర్ సినిమాలు తక్కువే..ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. కానీ ఇటీవలికాలంలో మలయాళంతో పాటు తెలుగులోనూ హారర్, థ్రిల్లర్ సినిమాలు పెరిగాయి. గతేడాది ఈషా అనే హారర్ మూవీ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన మరో తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అదే 'అగధ'. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్త, జోవిక విజయ్‌కుమార్, భాను చందర్, వనిత విజయ్ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు.
అయితే అగధ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ ఓటీటీ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 25 నుంచి జీ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేసింది. మంచికి, చెడుకు మధ్య ఒక భయంకరమైన పోరు మొదలు కాబోతోంది అనే ఆసక్తికరమైన క్యాప్షన్ ను ఈ పోస్టర్ కు జత చేయడం విశేషం. ఇక అగధ మూవీకి రాకేష్ వెంకటపురం, అరుళ్ దేవ్ మ్యూజిక్ అందించారు. అగధ మూవీలోని దైవిక శక్తులు, ప్రతికూల శక్తుల నడుమ సాగే పోరాటాన్ని ఎంఎస్ రాజు స్క్రీన్ పై చాలా ఇంటెన్స్ గా ఆవిష్కరించారు. అగధ మూవీ మిక్స్ డ్ టాక్ తోనే థియేటర్లలో పది కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి రానున్న నేపథ్యంలో థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఎంచక్కా ఇంట్లో ఉండే చూడొచ్చు.

అగధ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఛత్తీస్ ఘడ్ లోని దట్టమైన అడవుల్లో ఉన్న గుహలోకి వెళ్లినవారు ఎవరూ తిరిగిరాకుండా పోతారు. మహిమ తను ప్రేమించిన సింహ, స్నేహితుడు బబ్లూతో కలిసి గుహలోకి వెళ్తారు. ఆ గుహ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహిమ, బబ్లూ చనిపోతారు. సింహ మిస్సింగ్ అవుతాడు. ఈ క్రమంలో ఆ మాయా గుహ మిస్టరీని మహాదేవి ఎలా ఛేదించింది..? ఆ గుహలో ఉన్న తంత్ర శక్తులతో దేవుడి అండతో మహాదేవి ఎలా పోరాడింది..? అలాగే మహిమతో మహాదేవికి ఉన్న సంబంధం ఏంటి..? అనేదే ఈ మూవీ స్టోరీ..












Click it and Unblock the Notifications
