భారత్ కు రష్యా ఎందుకంత ముఖ్యం..? అమెరికాను సైతం పక్కనబెట్టి చిరకాల మిత్రుడివైపే భారత్.. కారణాలు ఏంటి..?

భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ లతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. అటు పాకిస్థాన్ తో దశాబ్దాలుగా భారత్ యుద్ధం, ఉగ్రదాడులను ఎదుర్కుంటుంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలు, ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. అలాగే చైనాతోనూ సరిహద్దు విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కుంటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. 2020 లో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇక అటు బంగ్లాదేశ్ తోనూ భారత్ కు సఖ్యత లేకుండా పోయింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం, రాజకీయ సవాళ్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందడం.. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ కు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ హిందువులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు కలిగిస్తున్నాయి.

ఇలా సరిహద్దు దేశాలతో భారత్ ఎప్పుడూ ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కుంటూనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. అటు వాణిజ్యం, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో నేనున్నానంటూ ఎప్పటికప్పుడు ఆపన్నహస్తం అందిస్తూ సోదరుడిలా భారత్ కు అండగా నిలుస్తోంది. రష్యా- భారత్ మధ్య అంతలా విడదీయరాని బంధం ఏర్పడింది. భారత్ కు వచ్చిన ప్రతి కష్టంలోనూ రష్యా తన చేతనైన సాయంతో ముందుకు నడిపింది. గతేడాది పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రష్యా అందించిన ఎస్-400 ఆయుధ వ్యవస్థ సాయంతోనే పాక్ కు భారత్ చుక్కలు చూపించింది. అటు పాకిస్థాన్ వెనకాల ఉండి సపోర్ట్ చేసిన చైనాకు కూడా బుద్ధి చెప్పింది భారత్.

ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చమురు కొరత ఉన్న నేపథ్యంలో భారత్ కు ముడి చమురును తక్కువ ధరకు అందించడంలో రష్యా ముందుంటోంది. అలాగే రష్యా సాయంతోనే భారత్.. కుందన్ కులమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను అభివృద్ధి చేస్తోంది. భారత్ కు క్లీన్ ఎనర్జీ అవసరాలను తీర్చడంలో ఈ అణు కేంద్రం ఉపయోగపడనుంది. అలాగే బొగ్గు, ఎరువులను కూడా భారత్ కు రష్యా ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే మఖ్యంగా భారత్ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో రష్యా పాత్ర గణనీయమైనదిగా చెప్పొచ్చు. ఫైటర్ జెట్స్, ట్యాంకర్లు, సబ్ మెరైన్స్ అభివృద్ధిలో రష్యా సాయం చేస్తూ వస్తోంది. అలాగే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను ఇరు దేశాలు కలిసి అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవలి కాలంలో భారత్- రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. బ్రిక్స్ సమావేశం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కావడంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య రక్షణ రంగం మరింత బలోపేతం కానున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో రష్యాకు చెందిన ఎస్ 400 ఆయుధ వ్యవస్థ భారత్ ను విజయ తీరాలకు చేర్చడంతో ఎస్ 500 ఆయుధ వ్యవస్థను కూడా భారత్ కు ఆఫర్ చేసింది రష్యా. అలాగే ఫిఫ్త్ జనరేషన్ ఎస్ యూ సుఖోయ్-57 ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేసే ఆలోచనలో భారత్ ఉంది. చైనా వద్ద ఇప్పటికే అత్యాధునిక చెంగ్డూ జే-20, మల్టీ రూల్ షెన్యాంగ్ జే- 35 లాంటి ఫైటర్ జెట్స్ ఉన్న నేపథ్యంలో భారత్ కు సుఖోయ్-57 ఫైటర్ జెట్స్ చాలా కీలకం కానున్నాయి.

India long-standing ally Russia continues to stand by it Amidst the threats from Pakistan China

అయితే రష్యా నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను, చమురు కొనుగోలు చేయడం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ మేరకు భారత్ పై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతోంది అమెరికా. CAATSA( కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్) పేరుతో నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కాట్సా యాక్ట్ ప్రకారం ఇరాన్, నార్త్ కొరియా, రష్యా నుంచి ఏ దేశమైనా ఆయుధాలు కొనుగోలు చేస్తే ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించనుంది. అటు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు పైనా అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధిక శాతం టారిఫ్ లు విధిస్తానంటూ బెదిరింపులకు సైతం దిగింది. అయితే భారత్ మాత్రం అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా తన చిరకాల మిత్రదేశమైన రష్యానే నమ్ముకుంది. భవిష్యత్తులో భారత్- రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. దాంతో పాకిస్థాన్, చైనా దేశాలు కూడా ఇప్పుడు భారత్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+