బిగ్ బాస్ లో సర్ ప్రైజ్: ఫస్ట్ హౌస్ కేప్టెన్ గా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షోలో చోటుచేసుకుంటోన్న పరిణామాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోన్నాయి. ఎటువంటి గ్లామర్ హంగులు లేకుండా, సామాన్యురాలిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఝాన్సీ తనదైన ఆటతీరుతో టైటిల్ రేసులో ఓ బలమైన పోటీదారుగా అవతరించింది. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆమె.. టాస్క్ మొదలైన కొద్ది రోజుల్లోనే హౌస్ సభ్యులను వెనక్కి నెట్టింది. ఈ సీజన్ మొదటి కెప్టెన్‌గా నిలిచింది.

కఠిన సవాళ్లు, వ్యూహాత్మక ఘర్షణలు, భావోద్వేగాల మధ్య సాగిన కేప్టెన్సీ పోటీలో ఝాన్సీ విజేతగా నిలిచారు. ఆఖరి టాస్క్‌లో ఆమె ఆటో రామ్ ప్రసాద్‌పై విజయాన్ని సాధించి, ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ రేసులో త్రిగుణ్, రామ్ ప్రసాద్, ఝాన్సీ, ముఖేష్, షాలినీ ప్రధాన పోటీదారులుగా బరిలోకి దిగారు. వీరి నుంచి తుది ఇద్దరిని ఎంపిక చేయడానికి బిగ్ బాస్.. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అనే జైలు టాస్క్‌ను ఇచ్చాడు.

Commoner Jhansi Becomes 1st Captain Of Bigg Boss Telugu 10 House after actively involved in Tasks

ఈ ఆట మొత్తం కూడా వాగ్వివాదాలతోనే సాగింది. ప్రారంభంలోనే టాస్క్ నుండి షాలిని వైదొలిగారు. వర్షిణి, సుధీర్, ముఖేష్‌ కావాలనే గ్రూపుగా ఏర్పడి తనను గేమ్ నుండి బయటకు పంపించేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో హౌస్‌లో ముఖేష్, త్రిగుణ్ మధ్య కూడా కొన్ని విభేదాలు బయటపడ్డాయి. అయినప్పటికీ ఈ సవాళ్లన్నింటినీ విజయవంతంగా దాటుకుని ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఇద్దరూ ఫైనల్ రౌండ్‌కు చేరుకోగలిగారు.

శ్రీవారి ప్రసాదాలకు క‌ళంకితం అంటగట్టారు..: రోజా
శ్రీవారి ప్రసాదాలకు క‌ళంకితం అంటగట్టారు..: రోజా

ఫైనల్ రౌండ్ లో ఝాన్సీ మాత్రమే ఉండటంతో ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్ విజయం సాధిస్తాడని అందరూ భావించారు. ఆట ప్రారంభానికి ముందే తోటి సభ్యులతో కూడా తానే విజేతగా నిలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన చివరి టాస్క్ లో అతను తడబడ్డాడు. దీన్ని ఝాన్సీ లౌక్యంగా వాడుకున్నారు. ఈ గేమ్‌ను పూర్తి చేసి చివరకు తొలి కెప్టెన్సీని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష దశను దాటి హౌస్‌లోకి ప్రవేశించినప్పుడే గోల్డెన్ టికెట్ సాధించిన ఝాన్సీ.. ఈ విజయంతో టైటిల్ రేసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచారు.

ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 80,000 వరకు సహాయం: ప్రధాని మోదీ
ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 80,000 వరకు సహాయం: ప్రధాని మోదీ

ఇతర సెలబ్రిటీ కంటెస్టెంట్ల మాదిరిగా హౌస్‌లోకి నేరుగా కాకుండా అత్యంత కఠిన అగ్ని పరీక్ష ద్వారా తన స్థానాన్ని సంపాదించుకుంది.. ఝాన్సీ. ఈ షో నిర్వాహకులు పెట్టిన కఠిన టాస్క్ లను పట్టుదలతో పూర్తి చేసింది. ఆమె కళ్లల్లో కనిపించే నిజాయితీ, రైతుబిడ్డగా కష్టపడే తత్వం బుల్లితెర వీక్షకులను ఎంతగానో కనెక్ట్ చేసింది. తోటి కంటెస్టెంట్ల నుండి ఎదురైన పోటీని తట్టుకుని టాస్క్ లల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలి కెప్టెన్సీ బ్యాండ్‌ను కైవసం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+