మర్మాంగాలను కొరికిన భార్య.. ముక్కు కోసిన భర్త!
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా సాండి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగి ఒకరిపై ఒకరు పాశవికంగా దాడులు చేసుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల క్రితం వివాహమైన సాధన, దీపక్ దంపతులకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రెండున్నర నెలల క్రితం సాధన తన భర్త స్నేహితుడైన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే ఇటీవల గురువారం నాడు ఆమె అకస్మాత్తుగా పొరుగువారి ఇంటి కప్పుపై నుంచి దూకి తన భర్త ఇంట్లోకి ప్రవేశించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
ముక్కుకోసి మురుగు కాలువలో పడేశాడని భార్య ఆరోపణ
తన పిల్లలను తనతో తీసుకెళ్లడానికి సాధన ప్రయత్నించడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన భర్త దీపక్ తనపై దాడి చేసి ముక్కును కోసేసి మురుగు కాలువలో పడేశాడని సాధన ఆరోపించింది. ఈ దాడి జరుగుతున్న సమయంలో తన అత్తమామలు తన చేతులు పట్టుకుని భర్తకు సహకరించారని ఆమె ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ముందుగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

భర్త మర్మాంగాలను కొరికిందంటున్న అత్తమామలు
మరోవైపు దీపక్ కుటుంబ సభ్యులు సాధనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సాధన అకస్మాత్తుగా వచ్చి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించిందని, అడ్డుకున్న భర్త దీపక్ మర్మాంగాలను కొరికి తీవ్రంగా గాయపరిచిందని అతని తల్లి పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత సాధన స్వయంగా గోడకు తల బాదుకుని గాయాలు చేసుకుందని ఆరోపించింది. ఈ ఘటనపై దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సాండి పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.













Click it and Unblock the Notifications
