ఆధునిక చరిత్రలో అత్యంత కఠిన దశాబ్ధం.. కరోనా, యుద్ధాల తర్వాత మరో భారీ సంక్షోభం!

యూరప్ తన ఆధునిక చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశాబ్ధాన్ని ఎదుర్కొంటోంది. యూరప్ చరిత్రలోనే అత్యంత అస్థిరమైన దశాబ్ధాలలో ఒకటిగా 2020వ దశాబ్ధం గుర్తుండిపోతుంది. కరోనా మహమ్మారి సమయంలో విధించిన లాక్‌డౌన్లతో ఇది ప్రారంభమైంది. దీనివల్ల యూరోపియన్ యూనియన్ అంతటా జీడీపీ 6.1 శాతం క్షీణించింది. 1930వ దశాబ్ధం తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఇంధన సంక్షోభం.. ఆ తర్వాత ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది.

సంచలనానికి తెర తీసిన ఐరాస- నూతన వరల్డ్ మ్యాప్: మెర్కెటర్ కు కాలం చెల్లు: ఇకపై..
సంచలనానికి తెర తీసిన ఐరాస- నూతన వరల్డ్ మ్యాప్: మెర్కెటర్ కు కాలం చెల్లు: ఇకపై..

సాంకేతికత, వ్యాపార రంగాల్లో వెనుకబాటు
ఓ వైపు ఇంధన సంక్షోభం వేధిస్తుంటే.. మరోవైపు గ్లోబల్ టెక్నాలజీ పోటీలోనూ యూరప్ వెనుకబడింది. 2022లో ఏఐ విప్లవం ఊపందుకున్నప్పుడు అమెరికా, చైనాలతో పోలిస్తే యూరప్ మౌలిక వసతులు, పెట్టుబడుల్లో చాలా వెనుకబడిపోయింది. 2020 నుంచి 2025 మధ్య అమెరికా ఏఐ రంగంలో సుమారు 500 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను రాబట్టగా.. యూరవ్ కేవలం 50 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. దీనికితోడు అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల యూరప్ నుంచి జరిగే 600 బిలియన్ డాలర్ల వార్షిక ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.

Europe Energy Crisis Severe Economic Struggles and Supply Halts from Saudi Arabia amid the Red Sea crisis

సౌదీ అరేబియా సరఫరా నిలిపివేత, హౌతీల బీభత్సం
తాజా ఇరాన్ యుద్ధ పరిణామాలతో యూరప్‌కు ముడి చమురు లభ్యత మరింత క్లిష్టంగా మారింది. రోజుకు దాదాపు 5,77,000 బ్యారెళ్ల చమురును యూరప్‌కు సరఫరా చేసే సౌదీ అరేబియా 'ఈస్ట్-వెస్ట్ పైప్‌‌లైన్' మార్గంపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఆ మార్గం మూతపడింది. దీంతో వచ్చే నెల నుంచి ముడి చమురును పంపలేమని సౌదీ అరేబియా యూరోపియన్ రిఫైనరీలకు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎర్రసముద్రంలోని 'బాబ్ అల్-మండేబ్' జలసంధిని హౌతీలు అడ్డుకుంటే.. రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా నిలిచిపోయి యూరప్‌లో కరెంట్, ఇంధన సరఫరాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది.

PM Rozgar Yojana: కొలువుల పండుగ! ఒక్కరోజే 51 వేల మందికి సర్కారీ ఉద్యోగాలు..
PM Rozgar Yojana: కొలువుల పండుగ! ఒక్కరోజే 51 వేల మందికి సర్కారీ ఉద్యోగాలు..

దిక్కుతోచని స్థితిలో యూరప్ దేశాలు
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ ఇప్పటికే చవకగా లభించే రష్యా చమురు, సహజ వాయువుపై నిషేధం విధించింది. ప్రత్యామ్నాయంగా మధ్యప్రాచ్యంపై ఆధారపడదామనుకుంటే ఇక్కడ ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ సరఫరాల నిలిపివేత యూరప్‌ను ఊహించని సంక్షోభంలోకి నెట్టాయి. ఓ వైపు అమాంతం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండగా.. మరోవైపు ఇంధన కొరతతో పరిశ్రమలు, పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+