స్థానిక ఎన్నికల్లో జనసేన కు సీట్ల వాటా.. పోటీ పై తేల్చేసిన మనోహర్..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ నెలాఖరు లోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. సీట్ల షేరింగ్ తో పాటుగా సమన్వయం పైన మూడు పార్టీలు చర్చిస్తున్నాయి. ఈ సమయంలోనే జనసేన కు సీట్ల కేటాయింపు.. తాము పోటీ చేసే స్థానాల పైన ఆ పార్టీ నేతలు స్పష్టత ఇస్తున్నారు. 2024 ఎన్నికల ఫార్మలా వర్కవుట్ అవదని తేల్చి చెబుతూనే... పోటీ పైనా నేతలు.. కేడర్ కు క్లారిటీ ఇస్తుండటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
స్థానిక ఎన్నికల పైన జనసేన ముఖ్య నేత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్‌రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని పొరపాట్ల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సమస్య తలెత్తితే వెంటనే పార్టీ హైకమాండ్‌కి తెలియ జేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఆయా వార్డుల వారీగా నాయకత్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులకు తాము అండగా నిలుస్తామని మాటిచ్చారు.

సమష్టి నాయకత్వం తో తాము ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్య ప్రాముఖ్యం కాదని.. గెలిచే బలం ఉన్న చోట తాము పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. జనసేన.. జనం కోసం పుట్టిందని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో పాఠాలు ఉండవని.. అనుభవమే పాఠమని చెప్పారు. గతంలో జీవీఎంసీలో మూడు చోట్ల గెలిచామని... ఏడు చోట్ల సెకండ్ ప్లేస్‌కు వచ్చామని వెల్లడించారు.
పార్టీ నేతలకు దిశా నిర్దేశం
అదే విధంగా స్థానిక ఎన్నికల్లో టికెట్ వస్తే గెలుస్తామనే ఆలోచనలు పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలని ఆదేశించారు. అన్ని విషయాలను ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాలు, స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టితో కేడర్ పని చేయాలని సూచించారు. కూటమి భాగస్వామ్యం వల్లే ఏపీ ఈ స్థాయికి చేరుకోగలిగిందని.. మూడు పార్టీలు బలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో సీట్ల శాతం తగ్గకుండా మూడు పార్టీల ఒప్పందం ఉండాలని జనసేన కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. వచ్చే వారం సీఎం చంద్రబాబు- పవన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని.. ఆ సమయంలో సీట్ల షేరింగ్ పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
