జేమ్స్ బాండ్ చరిత్రలో సరికొత్త సంచలనం.. బాండ్ గర్ల్ రేసులో ట్రాన్స్‌జెండర్ నటి!
James Bond: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రఖ్యాత స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'జేమ్స్ బాండ్' తదుపరి చిత్రం గురించి హాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తదుపరి 007 ఏజెంట్‌గా హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సరసన బాండ్ గర్ల్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక పాత్ర కోసం ప్రముఖ హాలీవుడ్ ట్రాన్స్‌జెండర్ నటి హంటర్ షాపర్ పేరు తెరపైకి రావడం విశేషం. ఒకవేళ ఈ బంపర్ ఆఫర్ ఆమెకే దక్కితే.. దశాబ్ధాల జేమ్స్ బాండ్ సినీ చరిత్రలో తొలి ట్రాన్స్ జెండర్ బాండ్ గర్ల్‌గా 27 ఏళ్ల హంటర్ షాఫర్ సరికొత్త రికార్డు సృష్టించనుంది.
బాండ్ గర్ల్ పాత్రపై ఆసక్తి వ్యక్తం చేసిన హంటర్ షాఫర్
తదుపరి బాండ్ చిత్రంలో నటించడంపై హంటర్ షాఫర్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇటీవల జరిగిన 'బ్లేడ్ రన్నర్ 2099' ప్రీమియర్ వేడుకలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బాండ్ సినిమాలో అవకాశం వస్తే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. "జేమ్స్ బాండ్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీలో బాండ్ గర్ల్ అయ్యే అవకాశాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఆ అవకాశాన్ని కాదనడం నా ఊహకు అందడం లేదు" అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది.

మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ 'వెరైటీ' తదుపరి బాండ్ గర్ల్ రేసులో ఉన్న ప్రముఖ నటీమణుల జాబితాను రూపొందించింది. ఇందులో హంటర్ షాఫర్ పేరును ప్రత్యేకంగా చేర్చడంతో ఈ కాస్టింగ్ ఊహగానాలకు మరింత బలం చేకూరింది. ఈ జాబితాలో హాలీవుడ్ టాప్ హీరోయిన్లు జెండయా, ఆస్కార్ విజేత లుపిటా న్యాంగో వంటి స్టార్ల పేర్లు కూడా ఉండటం గమనార్హం.
గట్టి పోటీ ఇస్తున్న హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు
హెచ్‌బీవో సూపర్ హిట్ టీన్ డ్రామా సిరీస్ 'యుఫోరియా' ద్వారా హంటర్ షాఫర్ అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ది హంగర్ గేమ్స్: ది బల్లాడ్ ఆఫ్ సాంగ్‌బర్డ్స్ అండ్ స్నేక్స్', హారర్ థ్రిల్లర్ 'కుకూ', 'మదర్ మేరీ' వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. అయితే బాండ్ గర్ల్ వంటి క్రేజీ పాత్రను దక్కించుకోవడం హంటర్‌కు అంత సులభం కాకపోవచ్చు. ఈ పాత్ర కోసం ప్రస్తుతం హాలీవుడ్‌లో అగ్రశ్రేణి నటీమణులుగా కొనసాగుతున్న సిడ్నీ స్వీనీ, ఫ్లోరెన్స్ పగ్, మార్గరెట్ క్వాలీ వంటి స్టార్ హీరోయిన్ల నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతోంది.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
గతంలో పలు సందర్భాల్లో హంటర్ షాఫర్ మాట్లాడుతూ.. కేవలం తన జెండర్ ఐడెంటిటీకి పరిమితమైన పాత్రలకే కాకుండా తన నటనా ప్రతిభ ద్వారానే గుర్తింపు పొందాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. బాండ్ గర్ల్ వంటి శక్తివంతమైన పాత్ర దక్కితే అది ఆమె కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ క్యాస్టింగ్ వార్తలన్నీ ఊహాగానాల దశలోనే ఉన్నాయి. జేమ్స్ బాండ్ తదుపరి అధ్యాయంలో రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన నటించే ఆ లక్కీ బాండ్ గర్ల్ ఎవరనే దానిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.













Click it and Unblock the Notifications
