కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి, రగులుతున్న ఎమ్మెల్యేలు..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒకరి తరువాత మరొకరు నేరుగా నాయకత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. బాహాటంగానే గళం విప్పుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కమీషన్ల భాగోతం పైన చేస్తున్న ఓపెన్ కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరకాటం లోకి నెడుతున్నాయి. నిధుల కేటాయింపు లో జాప్యం ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతోంది. రాష్ట్రంలో పరిణామాల పై ఏఐసీసీ పూర్తి సమాచారం సేకరిస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తి చేసుకుంటున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు సీఎం రేవంత్ ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో వారి కంటే కాంగ్రెస్ కు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాహాటంగానే గళం విప్పుతుండటం సమస్యగా మారుతోంది. నిధుల కొరత మాత్రమే కాకుండా, సంక్షేమ హామీల అమలులో జాప్యం, ప్రభుత్వ యంత్రాంగంలో కమీషన్ల వ్యవహారం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఇప్పుడు పార్టీకి- ప్రభుత్వంలోని ముఖ్యులకు కొత్త తల నొప్పులు తెచ్చి పెడుతోంది.

 అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
congress-faces-internal-challenges-as-own-party-leaders-raise-concerns-aicc-seek-report

ఏఐసీసీకి నివేదికలు

సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలకు వేల కోట్ల మేర నిధులు తీసుకెళ్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు. వెనుకబడిన తన నియోజక వర్గానికి కనీసం రూ. 500 కోట్లు ఎందుకు కేటాయించరని ఆయన నిలదీశారు. అదే విధంగా తాజా గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. తన నియోజకవర్గంలో రహదారి పనులకు సంబంధించి సుమారు రూ. 40 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి కోసం అవసరమైతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. నిధుల కోసం తాను కూడా చావడానికైనా సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిల్లుల ప్రాసెసింగ్ కోసం అధికారులు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. మంత్రులు సైతం తమ పని వరకే పరిమితం అవుతున్నారు. సీఎం నిత్యం ఏదో ఒక కార్యక్రమం తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పార్టీలో సొంత నేతల నుంచే వస్తున్న అసమ్మతి ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+