హైదరాబాద్ లో పార్టీలు,ఫంక్షన్ల పై కీలక మార్గదర్శకాలు- 100 మంది దాటితే, తప్పనిసరి..!!

ఇక నుంచి పార్టీలు.. ఫంక్షన్లు నిర్వహించాలంటే కొత్త నిబంధనలు పాటించాల్సిందే. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే పార్టీలు, ఫంక్షన్లపై కొత్త నిబంధనలు విధించారు. ఇకపై 100 మందికి పైగా పాల్గొనే ఎలాంటి ఈవెంట్ నిర్వహించాలన్నా కనీసం 3 పని దినాల ముందే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పోర్టల్‌లో ఆన్‌లైన్ సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేశారు. వేడుకల తర్వాత చెత్త నిర్వహణ పైన స్పష్టత ఇచ్చారు. ఉల్లఘించిన వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సైబరాబాద్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో భారీగా జరిగే వేడుకలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఫంక్షన్ల నిర్వహణ విషయంలో కఠిన నిర్ణయాలకు సిద్దం అయ్యారు. వేడుకల పేరుతో ఎకడపడితే అకడ చెత్త వేసి చేతులు దులుపుకొనే నిర్వాహకుల తీరు కు అడ్డుకట్ట వేస్తూ కీలక మార్గదర్శకాలు జారీచేశారు.

హైదరాబాద్ నూతన సీపీ మహేష్ భగవత్ తొలి హెచ్చరిక..!!
హైదరాబాద్ నూతన సీపీ మహేష్ భగవత్ తొలి హెచ్చరిక..!!
Cyberabad Municipal Commission Introduces New Rules for Parties and Functions details here

ఇకపై 100 మందికి పైగా పాల్గొనే ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా.. కనీసం మూడు పని దినాల ముందే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పోర్టల్‌ ద్వారా స్థానిక సంస్థకు సమాచారం ఇవ్వాలని నిర్దేశించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఘన వ్యర్థాల నిర్వహణ) నిబంధనల్లోని రూల్‌ 5(1)(జే) ప్రకారం ఈ ఆదేశాలను పకాగా అమలు చేయాలని సీఎంసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.తడి, పొడి చెత్తను వేరు చేసి ఆథరైజ్డ్ ఏజెన్సీలకే ఇవ్వాలని ఆదేశించారు.

ఎవరైనా ఈ గైడ్‌లైన్స్ పాటించని ఆర్గనైజర్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిక చేసారు. అదే విధంగా అనుమతులు లేని బహిరంగ ప్రదేశాల్లో జరిగే సమావేశాలు, ఈవెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. తమ పరిధిలోని ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్‌ సూచించారు.

మున్సిపల్ సమరం వేళ రూటు మార్చిన కొడాలి నాని - కొత్త లెక్కలు, అసలు సవాల్..!!
మున్సిపల్ సమరం వేళ రూటు మార్చిన కొడాలి నాని - కొత్త లెక్కలు, అసలు సవాల్..!!

పోర్టల్‌ వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు, శానిటేషన్‌ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. సీఎంసీ పరిధిలో పరిశుభ్రతను కాపాడేందుకు ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+