ENE Repeat Movie Review: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రివ్యూ: ఆ పాత మ్యాజిక్ మిస్ అయిందా?

చిత్రం: ఈ నగరానికి ఏమైంది రిపీట్
నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్, రాజీవ్ కనకాల, శ్రీరామచంద్ర తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం
విడుదల తేదీ: నవంబర్ 19, 2026

'ఆకాశంలో ఒక తార' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందా..?
'ఆకాశంలో ఒక తార' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందా..?

స్టోరీ ఏమిటంటే?
2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలోని కన్యారాశి గ్యాంగ్(వివేక్, కౌశిక్, కార్తీక్, ఉప్పు) మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి వీరి సినిమా ప్రయాణం థాయిలాండ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఓ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా తీసే క్రమంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? తమను తాము ఎలా కొత్తగా ఆవిష్కరించుకున్నారు? చివరికి అనుకున్న సినిమాను పూర్తి చేశారా లేదా? అన్నదే 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' స్టోరీ.

ENE Repeat Movie Review Abhinav Gomatam Shines with Hilarious Comedy But Misses Old Magic Details

నటీనటులు ఎలా నటించారంటే?
చాలా కాలం తర్వాత విశ్వక్ సేన్ తన పాత ఫామ్‌లోకి వచ్చారు. స్క్రీన్‌ పై చాలా ఫిట్‌గా, హుషారుగా కనిపిస్తూ వివేక్ పాత్రలో ఒదిగిపోయారు. అయితే ఈ సినిమాకు అతిపెద్ద బలం అభినవ్ గోమటం, కౌశిక్ పాత్రలో ఆయన పండించిన కామెడీ, హావభావాలు, వన్-లైనర్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఉప్పు పాత్రలో వెంకటేష్ కాకుమాను కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో సాయి సుశాంత్ రెడ్డి పోషించిన కార్తీక్ పాత్ర లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ స్థానంలో శ్రీనాథ్ మాగంటి ఫర్వాలేదనిపించినా, పాత కార్తీక్‌లో ఉండే ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ ఇందులో మిస్ అయ్యాయి. శివాత్మిక రాజశేఖర్ పాత్ర సాధారణంగా ఉండగా.. అనీషా ఆంబ్రోస్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోదు. ప్రియదర్శిని రామ్, నెగటివ్ షేడ్స్‌లో సింగర్ శ్రీరామచంద్ర ఓకే అనిపించారు. రాజీవ్ కనకాల ఎంట్రీ సీన్, 'టీఎఫ్ఐ బతకాలి' రిఫరెన్స్ బాగా పేలాయి.

విశ్లేషణ:
మొదటి భాగం 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చూస్తున్నప్పుడు మన పక్కన ఉండే నిజమైన స్నేహితులను చూస్తున్నట్లు అనిపించేది. గోవా ట్రిప్, సహజమైన సంభాషణలు యువతను కట్టిపడేశాయి. కానీ 'ఈ నగరానికి ఏమైంది రిపీట్'లో ఈ సహజత్వం కొరవడింది. సీక్వెల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమాగా ఇది అనిపిస్తుంది. సినిమా మొదలైన మొదటి 30 నుంచి 45 నిమిషాల వరకు కథనం చాలా నెమ్మదిగా, బోరింగ్‌గా సాగుతుంది. పబ్ సీన్ తర్వాత సినిమా కాస్త ఊపందుకుని ఇంటర్వెల్ వరకు బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. సెకండాఫ్‌లో థాయిలాండ్ నేపథ్యంలో సాగే కథనంలో కామెడీ అక్కడక్కడా మాత్రమే వర్కౌట్ అయింది.

OM Movie First Review: ధనుష్ 'ఓం' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!
OM Movie First Review: ధనుష్ 'ఓం' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!

అయితే సినిమాలో కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్వస్తాయి. ఫస్టాఫ్‌లో ఉప్పు వీఎఫ్ఎక్స్ ఎడిటింగ్ సీన్, పబ్ సీన్ బాగున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కౌశిక్, అతని డూప్‌తో సింగిల్ టేక్‌లో తీసిన 10-12 నిమిషాల ఫిల్మ్ మేకింగ్ ఎపిసోడ్ పైసా వసూల్ కామెడీని అందిస్తుంది. టాలీవుడ్ దర్శకుల అతిథి పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా క్యామియో బాగా పేలింది. మిగిలినవి మొక్కుబడిగా అనిపిస్తాయి. ప్రియదర్శిని రామ్ ట్రాక్, ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే నీతి సూక్తులు తరుణ్ భాస్కర్ మార్క్ రైటింగ్‌కు భిన్నంగా, కాస్త కృత్రిమంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం సంతృప్తికరంగా ముగుస్తుంది.

సాంకేతిక విభాగం:
వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా గుర్తుండకపోయినా, బీజీఎమ్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేశారు. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఫర్వాలేదు కానీ, 2 గంటల 45 నిమిషాల నిడివిని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు:

*అభినవ్ గోమటం కామెడీ

*సెకండాఫ్‌లోని సింగిల్-టేక్ ఫిల్మ్ మేకింగ్ సీన్

*వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

బలహీనతలు:

నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు

*మొదటి భాగంలో ఉన్న సహజత్వం, ఎమోషన్ లేకపోవడం

*సాగదీత

చివరగా:
మొదటి భాగంతో పోల్చుకోకుండా స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' ఒకసారి చూడదగ్గ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్!

రేటింగ్: 2.5/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+