IND vs NZ: భారత్‌కు బిగ్ షాక్.. కివీస్ అదిరిపోయే కమ్‌బ్యాక్!
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో భారత పేసర్లు నిప్పులు చెరగడంతో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ జట్టును హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో న్యూజిలాండ్ తిరిగి పుంజుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 82 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. నికోల్స్(113 నాటౌట్) అద్భుత సెంచరీతో క్రీజులో ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్(94 నాటౌట్) సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచాడు.
భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిల
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ టామ్ లాథమ్(0)ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఆ వెంటనే డెవాన్ కాన్వే(4)ను అన్షుల్ కాంబోజ్ ఔట్ చేయగా.. రచిన్ రవీంద్ర(15ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపాడు. డారిల్ మిచెల్(1)ను జస్ప్రీత్ బుమ్రా మరోసారి దెబ్బతీయగా.. టామ్ బ్లండెల్(5) కూడా త్వరగానే వెనుదిరిగాడు. దీంతో 70 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.

ఆదుకున్న నికోల్స్, ఫిలిప్స్ జోడీ
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఓ వైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు చక్కడి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.హెన్రీ నికోల్స్ 221 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్స్ 182 బంతుల్లో 13 ఫోర్లతో 94 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు.
భారత్ చేసిన ఆ ఒక్క తప్పిదమే కొంపముంచింది..
నిజానికి 153 పరుగుల భాగస్వామ్యం వద్ద ఈ జోడీని విడదీసే సువర్ణావకాశం భారత్‌కు లభించింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో నికోల్స్(102 పరుగుల వద్ద) ఇచ్చిన ఈజీ క్యాచ్ ను దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ మధ్య సమన్వయ లోపం కారణంగా నేలపాలు చేశారు. ఈ క్యాచ్ పట్టి ఉంటే తొలి రోజు ఆట పూర్తిగా భారత్ నియంత్రణలో ఉండేది. రెండో రోజు ఉదయం వీరిద్దరినీ త్వరగా ఔట్ చేసి కివీస్‌ను కట్టడి చేయాలని టీమిండియా భావిస్తోంది.














Click it and Unblock the Notifications
