ఢిల్లీని వణికించిన క్రైమ్: యువతిపై గ్యాంగ్ రేప్ హత్య - కుక్కలు ఏం చేశాయంటే..!!
ఢిల్లీ నగరం అంటే క్రైమ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దేశ రాజధాని నేరాల పుట్టగా మారుతోంది. అక్కడే రాష్ట్రపతి, అక్కడే ప్రధాని, అక్కడే హోంమంత్రి..ఇంద్రప్రస్థ నిత్యం నిఘా నీడలో ఉన్నప్పటికీ నేరాలు మాత్రం షరా మామూలే అన్నట్లుగా పరిస్థితి మారింది. నిర్భయ ఘటన తర్వాత వెన్నులో వణుకు పుట్టించే చట్టాలు తెచ్చినప్పటికీ...నేరగాళ్ల వెన్నులో మాత్రం ఎలాంటి వణుకు లేదు సరికదా..పైగా ఆ చట్టాలనే సవాలు చేసేలా నేరాలు చేసుకుంటూపోతున్నారు.తాజాగా మరో హత్యాచార ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. అత్యంత పాశవికమైన ఘటన ఇది.
యువతిపై సామూహిక అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో పాశవికమైన ఘటన వెలుగు చూసింది. కళ్ల నిండా కామం నింపుకున్న నలుగురు కామాంధులు పరిచయం ఉన్న ఓ 17ఏళ్ల యువతిపై లైంగిక దాడి చేశారు. నలుగురూ ఒకేసారి లైంగికంగా సామూహిక దాడి చేయడంతో ఆ యువతి పడ్డ బాధ ఆవేదన అంతా ఇంతా కాదు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ మూకల బలం ముందు చిక్కుకుపోయింది. ఈ నలుగురు కామాంధుల్లో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారు. యువతిపై సామూహిక అత్యాచారంకు పాల్పడిన తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని శివార్లకు తీసుకెళ్లి బహిరంగ ప్రాంతంలో పడేసి జారుకున్నారు. ఇక ఆ శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. సెప్టెంబర్ 13వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
మృతదేహం మొత్తం డీకంపోజ్ కావడంతో అసలు మృతి చెందింది మహిళా లేదా పురుషుడా అని నిర్థారించలేక పోయారని పోలీసులు తెలిపారు. "నిందితులకు బాధిత యువతి ముందుగానే పరిచయం ఉంది.ఘటనకు ముందు బాధిత యువతి నిందితులు కలిసి ఒక టెంపో వ్యాన్‌లో ప్రయాణించారు.టెంపోలో నిందితులు యువతి కలిసి మద్యం సేవించారు.ఆ తర్వాత యువతిపైకి ఈ కామాంధులు తెగబడ్డారు.ఆ తర్వాత ఆమెను హతమార్చి నగర శివార్లలో వదిలేశారు" అని పోలీసులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కుషాక్ రోడ్‌లో ఉన్న జైపాల్ రాణా అనే వ్యక్తికి సంబంధించిన స్థలంలో మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు వివరించారు. వీధి కుక్కల ఆ మృతదేహంపై పడి శరీరంలోని పలు భాగాలను తినేసినట్లు తాము గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. యువతికి చెందిన ఓ చేయి శరీరం నుంచి దూరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
50సీసీ ఫుటేజీల పరిశీలన
ఇదిలా ఉంటే మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులు ఎవరూ మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేయలేదని చెప్పిన పోలీసులు... తమ కూతురు అప్పుడప్పుడు సరదాగా అలా ఇంటిని వదిలి కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు. బీఎన్ఎస్ సెక్షన్లు పోక్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇక ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో ఘటన జరిగిన పరిసరాల్లో దాదాపుగా 50 సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో ఒక టెంపో వ్యాన్ కదలికను వారు గమనించారు. చీకట్లో టెంపో వ్యాన్ నెంబర్ స్పష్టంగా కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీలపై పోలీసులు ఆధారపడ్డారు.
ఇక అనుమానంగా తిరిగిన టెంపో వ్యాన్‌ను గుర్తించిన పోలీసులు, వ్యాన్ డ్రైవర్‌ను తమదైన స్టయిల్‌లో విచారణ చేయగా డొంక మొత్తం కదిలింది. దీంతో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిలో ముగ్గురు మైనర్ బాలురని వారి వయసు 16 ఏళ్ల నుంచి 17 ఏళ్లు ఉండగా... మరో నిందితుడిని ఖద్ద కాలని నివాసి అయిన శివం అలియాస్ సుదామ అలియాస్ చుచ్చుగా పోలీసులు గుర్తించారు. నేరం చేసేందుకు వినియోగించిన రెండు కత్తులు, ఘటన సమయంలో ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు














Click it and Unblock the Notifications
