కుమార్తెపై అత్యాచారం చేసి.. రెండుసార్లు గర్భవతిని చేసిన తండ్రి
నేటి కాలంలో మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కన్న తల్లిదండ్రులపైనే బిడ్డలు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. అటు కన్న బిడ్డలపై తల్లిదండ్రులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ కసాయి తండ్రి తన కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆమెను రెండుసార్లు గర్భవతిని చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెబుతూ బెదిరిస్తూ వచ్చాడు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళ 2023 లో తన ముగ్గురు కుమార్తెలను భర్త (39) వద్దే వదిలేసి, అతనికి దూరమైంది. అప్పటి నుంచి మైనర్ అయిన పెద్ద కుమార్తె(16)పై తండ్రి పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు.ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరిస్తూ.. కుమార్తెపై లైంగిక వేధింపులను కొనసాగిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే మాత్రలు తినిపించి గర్భస్రావం అయ్యేలా చేశాడు.
2025లో మళ్లీ గర్భవతి అవ్వగా.. వర్షా అనే నర్సు ఇంటికి తీసుకెళ్లాడు రాక్షస తండ్రి నకిలీ ఆధార్ కార్డు సృష్టించి.. ఆమెకు పెళ్లి అయ్యిందని చెప్పి.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మైనర్ బాలిక ఓ బిడ్డకు జన్మనివ్వగా.. ఆ పసిబిడ్డను అమ్మేసి.. తిరిగి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు తండ్రి. చివరికి తండ్రి వేధింపులు భరించలేక.. తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాల్ని బాధిత బాలిక వివరించింది.

తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మైనర్ బాలిక తండ్రి, ఆమె అత్తతో పాటు రోహిత్ కుమార్ రాయ్, అతని భార్య యోగితా రాయ్, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సాహెబ్ మండల్, అతని భార్య వర్షా మండల్, పసిబిడ్డను కొన్న ఓ వ్యక్తితో పాటు మరో మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications