Village for Sale: మా ఊరు అమ్మకానికి ఉంది.. ధర కేవలం నీళ్లే!

అది మహారాష్ట్రలోని ఓ అందమైన పల్లెటూరు. కానీ ఆ ఊరి రాత మాత్రం దారుణంగా మారిపోయింది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండక, కనీసం మూగజీవాలకు తాగునీరు కూడా అందక ఆ ఊరి ప్రజలు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు మారుతున్నా, హామీలు వస్తున్నా తమ ఊరి నీటి గోస మాత్రం తీరడం లేదని ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారుల కళ్లు తెరిపించేందుకు ఏకంగా తమ ఊరినే అమ్మకానికి పెట్టామంటూ సరికొత్త, వినూత్న నిరసనకు తెరతీశారు. 'మా ఊరు అమ్మకానికి ఉంది.. దీని ధర కేవలం నీళ్లు మాత్రమే' అంటూ ఊరి ప్రవేశ ద్వారాల వద్ద బ్యానర్లు కట్టి వారు చేసిన నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అలంకారప్రాయంగా మారిన సాగునీటి కాలువలు

మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని తులసి గ్రామంలో సుమారు 7,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ ఊరికి కూతవేటు దూరంలోనే 'సినా-మధా' ఎత్తిపోతల నీటిపారుదల పథకం కాలువలు వెళుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆ కాలువల్లో మాత్రం చుక్క నీరు పారడం లేదు. గత 26 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కేవలం 800 మీటర్ల తవ్వకం పనులు మాత్రమే అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆ కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే తమ ఊరి నీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలువలు దగ్గర్లోనే ఉన్నా తమ గొంతులు మాత్రం ఎండుకుపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Maharashtra Villagers Put Village for Sale With Price Set as Water in Protest Against Severe Crisis

ట్యాంకర్ల నీళ్లే గతి.. ఎండిపోయిన బావులు, చెరువులు

ఈ గ్రామంలోని 14 చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయి నెర్రెలు బారాయి. దీంతో గ్రామం పూర్తిగా వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ వర్షాకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తాగునీరు లేక వ్యవసాయం, పశుపోషణ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నీటి కష్టాల వల్ల ఊర్లో యువకులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని సర్పంచ్ శరద్ మోరే ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేని ఊరికి తమ పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దాదాపు 350 మంది యువకులు పెళ్లిళ్లు కాక ఒంటరిగా మిగిలిపోయారని ఆయన వాపోయారు.

1980s: ఫ్రీగా వచ్చే ఫోటోల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
1980s: ఫ్రీగా వచ్చే ఫోటోల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

ఆకలి కేకలు.. ఖాళీ కుండలతో రోడ్డెక్కిన ప్రజలు

ప్రభుత్వాల మోసపూరిత హామీలతో విసిగిపోయిన తులసి గ్రామస్థులు సెప్టెంబర్ 14 నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో మధా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఖాళీ కుండలను పగలగొడుతూ 'థాలీ-నాద్' నిరసన చేపట్టారు. కేవలం ప్రకటనలు, నిధుల కేటాయింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప గ్రౌండ్‌లో ఎలాంటి పనులు జరగడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. క్లోజ్డ్ పైప్‌లైన్ల ద్వారా నీటిని అందిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినా, కాగితాల మీద తప్ప ఆచరణలో ఏదీ రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీళ్లు తాగితే బ్రెయిన్ స్ట్రోక్! నిమిషం కంటే తక్కువ నిద్ర.. జిరాఫీ ఒంట్లో ఇన్ని రహస్యాలా!
నీళ్లు తాగితే బ్రెయిన్ స్ట్రోక్! నిమిషం కంటే తక్కువ నిద్ర.. జిరాఫీ ఒంట్లో ఇన్ని రహస్యాలా!

స్పందించిన ప్రభుత్వం.. శాశ్వత పరిష్కారం దక్కేనా?

గ్రామస్థుల ఈ వినూత్న నిరసన, 'విలేజ్ ఫర్ సేల్' బ్యానర్ల ఉదంతం మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. పూణేలో ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి దత్తాత్రయ భర్నే.. తులసి గ్రామం ఎదుర్కొంటున్న నీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, గ్రామానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే కేవలం మాటలతో సరిపెట్టకుండా వెంటనే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి తమ ఊరికి శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+