కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం!

మంగళవారం నవంబర్ 24, 2026 పవిత్ర కార్తిక పౌర్ణమి తిథి వేళ గ్రహ సంచారం, శుభ యోగాల ప్రభావం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై విభిన్నంగా ఉండనుంది. పంచాంగం ప్రకారం రాత్రి 8:25 గంటల వరకు కార్తిక శుక్ల పౌర్ణమి ఉండి, ఆ తర్వాత మార్గశిర కృష్ణ పాడ్యమి ప్రారంభమవుతుంది. రాత్రి 11:26 గంటల వరకు కృత్తిక నక్షత్రం, అనంతరం రోహిణి నక్షత్రం ఉంటాయి. సాయంత్రం 4:05 గంటల వరకు పరిఘ యోగం ఉండి, ఆ తర్వాత అత్యంత శుభప్రదమైన శివ యోగం ఏర్పడనుంది. ద్వాదశ రాశుల వారికి నేడు ఎలా ఉందో చూద్దాం:

మేషం: ఈ రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, మీ పనుల కంటే ఇతరుల పనులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సొంత పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, పాత ఆర్థిక లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడం మంచిది.

karthika purnima Horoscope 24 November 2026 Kartik Purnima amp amp Shiva Yoga Impact on Zodiac Signs

వృషభం : వృషభ రాశి వారికి అనుకూలమైన, ఆహ్లాదకరమైన రోజు. సంతానం వైపు నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. గతంలో వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంటుంది, శుభకార్యాల్లో పాల్గొనే వీలుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు.

మిథునం : ఈ రాశి వారికి పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆస్తి కొనుగోలు లేదా సంబంధిత వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యాలయంలో పనిభారం పెరగడం వల్ల కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కష్టంగా మారవచ్చు. స్నేహితుల ఆహ్వానం మేరకు విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణాలు, వాహన వినియోగంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడటంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను తొందరపడి లేదా భావోద్వేగాలతో తీసుకోకుండా, పెద్దల సలహా తీసుకోవడం మేలు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది, అయితే ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య : కన్యా రాశి వారికి రేపు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసివస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

తుల: తులా రాశి వారికి ఆర్థికంగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం, మాట తీరులో సంయమనం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి.

వృశ్చికం : ఈ రాశి వారికి పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు : ధనుస్సు రాశి వారికి శుభప్రదమైన రోజు. ఆకస్మిక ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది.

మకరం: మకర రాశి వారికి వృత్తిపరంగా పురోగతి లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. భూమి లేదా వాహన సంబంధిత ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం.

కుంభం : కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు.

మీనం : మీన రాశి వారికి రేపు ఎంతో శుభదాయకంగా ఉండనుంది. వ్యాపారంలో ఒక పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, మనసులోని కోరికలు నెరవేరుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+