"గొప్ప దేశభక్తుడు, జాతీయ సంపద"-NVIDIA సీఈఓను ఆకాశానికెత్తేసిన ట్రంప్..!

అమెరికాకు చెందిన ఎన్విడియా కంపెనీ సీఈఓగా ఉంటూ చైనా మహిళా వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని గూఢచర్యానికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొని పదవి కోల్పోయిన జెన్సెన్ హువాంగ్ (Jensen Huang) ఇవాళ తిరిగి ఆ పదవిలోకి వచ్చారు. ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సానుకూలంగా స్పందించారు. ముందు నుంచీ హువాంగ్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న ట్రంప్.. ఇవాళ ఆయన తిరిగి ఎన్విడియా బాధ్యతలు చేపట్టడంపై స్పందిస్తూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు.
ఈ మేరకు తన సొంత ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు పెట్టారు.

భారత్ నుంచి రాగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష..? బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక చర్చలు..!
భారత్ నుంచి రాగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష..? బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక చర్చలు..!

ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, జెన్సెన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓ పదవిలోకి తీసుకురావాలనే సరైన, సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారని ట్రంప్ తెలిపారు. ఎన్విడియా జెన్సెన్ నాయకత్వంలో ఉండటం వల్ల, ఆ సంస్థకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా విజయం, శ్రేయస్సు చేకూరుతాయన్నారు. జెన్సెన్ తిరిగి ఎన్విడియాలో చేరడం వల్ల జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు ఉంటుందని భావించడానికి అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి కారణం లేదన్నారు. జెన్సెన్ ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా అటార్నీ జనరల్ ధృవీకరించారన్నారు.

Trump Backs NVIDIA CEO Jensen Huang Calls Him Great Patriot and National Treasure
టారిఫ్ లపై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్- వాణిజ్య డీల్ చర్చల్లో కీలక హామీ..!
టారిఫ్ లపై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్- వాణిజ్య డీల్ చర్చల్లో కీలక హామీ..!

వ్యక్తిగతంగా చెప్పాలంటే, తనకూ జెన్సెన్ తెలుసని ట్రంప్ తెలిపారు. ఆయన గొప్ప దేశభక్తుడు, దేశానికి ఒక అమూల్యమైన సంపద అన్నారు. అదే సమయంలో, అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలను ఎన్విడియా పాటిస్తోందా లేదా అనే అంశంపై సంస్థ అంతర్గత విచారణను కొనసాగించాలన్నారు. తద్వారా, అమెరికా జాతీయ భద్రతను కాపాడటంలో తమ చట్టపరమైన బాధ్యతలను , దేశభక్తి కర్తవ్యాన్ని సంస్థ నెరవేరుస్తోందని నిర్ధారించుకోవాలన్నారు. జెన్సెన్‌కు, NVIDIA బోర్డుకు, అమెరికా ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరికీ ట్రంప్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+