అన్న మళ్లీ వచ్చేశాడ్రోయ్.. ఇక నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు..!
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. ఏడాది రెండు మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టడం ఆయన ప్రత్యేకత. ఈ ఏడాది కామ్రెడ్ కల్యాణ్, గాయపడ్డ సింహం, మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, నారి నారి నడుమ మురారి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు శ్రీ విష్ణు. అలాగే గతేడాది సింగిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అంతకుముందు స్వాగ్ సినిమాలోని విలక్షణమైన తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఓం భీమ్ భుష్, సామజవరగమన లాంటి చిత్రాలతో విజయాలను దక్కించుకున్నారు.

ఇక శ్రీవిష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ ప్యాక్'.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా ఫన్నీగా.. నాన్ స్టాప్ జాతరను తలపిస్తోంది. ఇక ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ఫ్యామిలీ ప్యాక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఇందులో ఇందులో శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది.
టీజర్ చూస్తుంటే ఈ మూవీని ఫన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేరంగా సాగుతోంది. ఈ మూవీలో అభిరామి, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్, ఆదిత్య చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'కాకా' అలాగే విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల సినిమాలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కూడా సంక్రాంతి రేసులో నిలిచింది.












Click it and Unblock the Notifications
