ఒక్కరే సినిమా తీస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్‌లో కొత్త ప్రయోగం!

బైక్ రైడర్‌గా 18 దేశాలు చుట్టివచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ టెక్నాలజీతో "కిరికిరి" అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్‌పై రవికాంత్ వీరేపల్లి నిర్మిస్తున్నారు. వన్ మ్యాన్ షో గా చెప్పాల్సిన "కిరికిరి" సినిమా రెగ్యులర్ మేకింగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌తో మొదలుపెట్టారు.

నెగిటివ్‌ టాక్‌ తోనూ దుమ్ములేపే కలెక్షన్స్.. నీ సినిమాకే సాధ్యం అన్నా..!
నెగిటివ్‌ టాక్‌ తోనూ దుమ్ములేపే కలెక్షన్స్.. నీ సినిమాకే సాధ్యం అన్నా..!

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. "డైరెక్టర్ భరద్వాజ్ దాయాల రూపొందిస్తున్న కిరికిరి సినిమా ఈ రోజు రెగ్యులర్ మేకింగ్ ప్రారంభించుకుంది. హైదరాబాద్ నేపథ్యంగా చార్మినార్ సెంటర్ పాయింట్‌గా హైబ్రిడ్ టెక్నాలజీ మూవీగా ఈ సినిమాను ఆయన రూపొందిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆరు నెలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ 180 రోజుల్లో క్వాలిటీ సినిమాను వారు తీసుకురాబోతున్నారు. వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా. వారి స్టూడియోను నేను చూశాను. తెరకెక్కించే ప్రతి సీన్‌ను వారు కంప్యూటర్ నుంచి స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటున్నారు. ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక ఒక వ్యక్తే సినిమాను రూపొందించవచ్చు అనేది ప్రపంచానికి చాటబోతున్నారు. ఇది ఒక కొత్త ప్రయోగం. మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మీరు చేసే ఈ ప్రయత్నం ఎంతోమంది యంగ్ టాలెంట్ చిత్ర పరిశ్రమలో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రపంచ సినిమాకు ఇదొక గొప్ప ముందడుగు కావాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా." అని దిల్ రాజు అన్నారు.

Kirikiri Movie Launch Dil Raju Claps for Bharadwaj Dayala AI Hybrid Telugu Film Full Details Here
ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా.. ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే!
ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా.. ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే!

డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ .. "ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి, ప్రొడ్యూసర్‌గా ఇన్నోవేటివ్ మూవీస్ నిర్మించిన దిల్ రాజు.. కిరికిరి సినిమా రెగ్యులర్ మేకింగ్‌కు క్లాప్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని 180 రోజుల్లో రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. సరిగ్గా నెలరోజుల్లో స్క్రీన్ ప్లే కంప్లీట్ చేస్తాం. దిల్ రాజు విజన్‌ను అంతా నమ్ముతారు. మేము కూడా మా స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించి సలహాలు తీసుకుంటాం. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కానీ కొత్త టెక్నాలజీ ఎప్పుడూ వచ్చినా అది ఎన్నో కొత్త దారులు తెరుస్తుంది. సినిమాను ఫోన్‌లో కూడా తీయగలం. ఒక్క వ్యక్తి ఒక సినిమా చేయగలడు అని ప్రూవ్ చేయడం ద్వారా ఎంతోమంది యంగ్ టాలెంట్‌కు కొత్త దారి దొరుకుతుంది. ఫాస్ట్‌గా సినిమా చేస్తే క్వాలిటీ ఉండదు అనే అపోహ ఉంది. టెక్నాలజీ ఉపయోగిస్తూ వేగంగా సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కిరికిరి ప్రాజెక్ట్ ను మంచి క్వాలిటీ మూవీ చేయాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత కంటెంట్ ఉన్నా, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. వందలాది సినిమాలు ఓటీటీలో ఉన్నా మనం కొత్త సినిమా ఏది వచ్చింది అని సెర్చ్ చేస్తాం. అలా కంటెంట్ క్రియేటర్స్ కు ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాంటేజ్ అవుతోంది." అని డైరెక్టర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+