భర్త నాగచైతన్య బర్త్‌డే వేళ శోభిత రొమాంటిక్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటో!
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు(నవంబర్ 23) తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్యకు అభిమానులు, సినీ ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందరి శుభాకాంక్షల కంటే ఆయన సతీమణి, నటి శోభిత ధూళిపాళ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన భర్తకు ఆమె అందించిన రొమాంటిక్ బర్త్‌డే విష్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'హ్యాపీ బర్త్‌డే లవర్'.. ఒక్క ఫోటోతో ప్రేమను చాటుకున్న శోభిత
సాధారణంగా సెలబ్రిటీలు తన భాగస్వామి పుట్టినరోజున పెద్ద పెద్ద ఎమోషనల్ నోట్స్ రాస్తుంటారు. కానీ శోభిత మాత్రం అందుకు భిన్నంగా, కేవలం మూడు పదాల క్యాప్షన్‌తో తన ప్రేమను వ్యక్తపరిచారు. నాగచైతన్య తనను దగ్గరకు హత్తుకుని ఉండగా.. ఇద్దరూ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్న ఓ రొమాంటిక్ ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి 'హ్యాపీ బర్త్‌డే లవర్' అంటూ క్యాప్షన్ జతచేశారు.

ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే జోడీ
నాగచైతన్య, శోభిత ధూళిపాళ 2024 డిసెంబర్లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా హడావిడికి దూరంగా.. ఎంతో ప్రైవేట్‌గా ఉంచుకుంటూ వస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే తమ మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత షేర్ చేసిన ఈ ప్రత్యేకమైన ఫోటో అక్కినేని అభిమానులకు కనువిందు చేస్తోంది. మాటలు తక్కువైనా, ఆ ఒక్క ఫోటోనే నాగచైతన్య బర్త్‌డే వేడుకల్లో హైలైట్‌గా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.













Click it and Unblock the Notifications
