ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా.. ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే!

తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానం, తెలుగు సినిమా ఇండస్ట్రీపై అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి 'సిద్ధుగాడి లవ్ స్టోరీ' సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా అనేది ఆయనకు కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల. ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు.

'రామాయణ' మూవీ సంచలనం.. మరో అరుదైన రికార్డు కైవసం..
'రామాయణ' మూవీ సంచలనం.. మరో అరుదైన రికార్డు కైవసం..

విదేశాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు సినిమా పట్ల తనకున్న అభిమానాన్ని మరచిపోకుండా, తన ఆలోచనలకు వెండితెర రూపం ఇవ్వాలనే లక్ష్యంతో దర్శకుడిగా అడుగులు వేస్తున్నారు. తన ఆలోచనలు, అనుభవం, సృజనాత్మకతతో ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలనే ప్రయత్నమే "సిద్ధుగాడి లవ్ స్టోరీ". శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది.

Siddugadi Love Story Release Date Director Ramesh Babu Cherukuru Movie Ready November 27 Full Details

ఈ చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తుండగా, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ నటిస్తున్నారు. ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

'ఆదర్శ కుటుంబం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వెంకీ ఫ్యాన్స్ గెట్ రెడీ..
'ఆదర్శ కుటుంబం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వెంకీ ఫ్యాన్స్ గెట్ రెడీ..

దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, "నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను" అలాగే టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు ఈ నూతన ప్రయత్నాన్ని ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+