మకర రాశి , కుంభ రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో మీన రాశి, కన్యా రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.

మీన రాశి, కన్యా రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మీన రాశి, కన్యా రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

మకర రాశి (ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు), శ్రవణం, ధనిష్ఠ (1, 2 పాదాలు)

డిసెంబర్ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి భాగంలో పనుల్లో కొంత జాప్యం లేదా ఒత్తిడి ఉన్నప్పటికీ, నెల రెండవ భాగంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి, ఓర్పుతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పని భారం కాస్త ఎక్కువగా ఉంటుంది. పైఅధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. నెల ద్వితీయార్థంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం.

Horoscope predictions and results for these two zodiac signs Capricorn and Aquarius for the Month of December

ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే ఆర్థిక సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా పెద్దల జోక్యంతో సద్దుమణువుతాయి. శుభకార్యాల ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమి, ఒత్తిడి లేదా కీళ్లు, నరాలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శనివారం నాడు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం.

వృశ్చిక రాశి, మకర రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
వృశ్చిక రాశి, మకర రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

కుంభ రాశి (నక్షత్రాలు: ధనిష్ఠ (3, 4 పాదాలు), శతభిషం, పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు)

కుంభ రాశి వారికి డిసెంబర్ నెల ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగుతుంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. మిత్రులు, సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్‌కు సంబంధించిన సానుకూల సంకేతాలు అందవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణకు నెల మొదటి మూడు వారాలు బాగా కలిసివస్తాయి.

ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే నెల చివరి వారంలో ఆకస్మిక ఖర్చులు ఎదురుకావచ్చు కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టాలి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల జలుబు, అలర్జీ లేదా కడుపు సంబంధిత చిన్నపాటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శివాలయంలో అభిషేకం చేయడం, పేదలకు అన్నదానం లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+