బంగారం మీ వల్లే తగ్గిందా? అయితే మరి ఇవీ..! మోడీకి వైసీపీ కేతిరెడ్డి మరో పంచ్..!

ధాని మోడీ విధానాలపై ఎప్పటికప్పుడు పంచ్ లు విసిరే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatrami Reddy) తాజాగా మరో బాంబు పేల్చారు. ప్రధాని మోడీ తాజాగా బంగారం ధరలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ కేతిరెడ్డి తనదైన శైలిలో పంచ్ విసిరారు. తన పిలుపుతోనే ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకోవడాన్ని కేతిరెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖరారు? కొత్త అభిమాన సంఘం- జయలలిత బిరుదుతో..!
త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖరారు? కొత్త అభిమాన సంఘం- జయలలిత బిరుదుతో..!

తన పిలుపు మేరకు ప్రజలు తక్కువ బంగారం కొన్నారని, అందుకే ధరలు తగ్గాయని తాజాగా లక్నోలో ప్రధాని మోదీ స్వయంగా చెప్పుకున్నారని, తన పిలుపు వల్లే బంగారం ధరలు తగ్గాయని క్రెడిట్ తీసుకున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. మరి అదే బంగారం ధరలు తగ్గడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు పడిపోయాయని, దీని క్రెడిట్ కూడా తీసుకుంటారా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. నవంబర్ 13తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు $14.2 బిలియన్లు తగ్గి, $705 బిలియన్లకు పడిపోయాయని, ఇది మూడు నెలల కనిష్ఠమని తెలిపారు.అందులో ఒక్క బంగారం నిల్వల విలువే $6.2 బిలియన్లు తగ్గిందన్నారు.

YSRCSP s Kethireddy Slams PM Modi Over Gold Price Remarks Questions Forex Reserve Decline
PM Modi:
PM Modi:

ఈ పతనానికి ప్రధాన కారణం బంగారం ధర తగ్గడం వల్ల వచ్చిన విలువ నష్టమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారని కేతిరెడ్డి తెలిపారు. అదే సమయంలో రూపాయి డాలర్‌కు ₹94.24కి బలహీనపడిందన్నారు. నిజానికి బంగారం ధరలు తగ్గడానికి అమెరికా వడ్డీ రేట్ల పెంపు, డాలర్ బలపడటం వంటి అంతర్జాతీయ కారణాలే ప్రధానమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారని, మంచి జరిగితే అది మా ఘనత. నష్టం జరిగితే అది ప్రపంచ పరిస్థితుల ప్రభావం. ఇదేనా మీ లెక్క? అంటూ ప్రధాని మోడీకి కేతిరెడ్డి చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+