బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, దూసుకొస్తున్న రెండు తుఫాన్లు..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో కీలక మార్పులు వస్తున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం తో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, బంగాళాఖాతంలో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు.. డిసెంబర్ రెండో వారంలో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, తెలంగాణ లో చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ సమయంలో ఐఎండీ కీలక సూచనలు చేసింది.
నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రేపు (మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు (23, 24) తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా.. బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పొంచి ఉన్న రెండు తుఫాన్లు
ఇది బలపడి తుఫాన్ గా మారి వచ్చే నెల నాలుగో తేదీ తరువాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా రానున్నదాని అంచనా వేసారు. అదే విధంగా డిసెంబర్ రెండో వారంలో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని.. దాని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించారు. కాగా.. తెలంగాణ లో కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహీర్‌లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. మారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్ ప్రాంతాల్లో 11 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది మార్చి తర్వాత బలహీనపడే అవకాశా లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో 2027 నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications
