PM Modi: "తినడం, తాగడం, ఎంజాయ్ కాదు-ఆ పని చేయండి" ప్రధాని మోడీ కీలక పిలుపు..!

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) దేశ ప్రజల్లో పెరుగుతున్న తినడం, తాగడం, ఎంజాయ్ చేయాలనే సంస్కృతిపై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని తన కేబినెట్ మంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకూ కీలక సూచన చేశారు. ప్రజల్లో పొదుపు చేయాలనే సంస్కృతిని పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ మేరకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాకిస్తాన్ ఆటోలో ప్రధాని మోడీ ప్రయాణం?- అసలు వాస్తవం ఇదే..!
పాకిస్తాన్ ఆటోలో ప్రధాని మోడీ ప్రయాణం?- అసలు వాస్తవం ఇదే..!

తినడం, తాగడం, విలాసంగా ఉండటం అనేది భారతీయ సంస్కృతి కాదని, మన సాంప్రదాయ విలువలు వినియోగంపై ఆధారపడిన జీవనశైలికి బదులుగా పొదుపును ప్రోత్సహిస్తాయని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భేటీలో ప్రధాని మోడీ తన కేబినెట్ మంత్రులు, కార్యదర్శులకు తెలిపారు. కాబట్టి దేశంలో పొదుపు, ఆర్ధిక క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడంలో విఫలమైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఇప్పటివరకూ సాధించిన పురోగతి అంతా వృథా అయ్యే ప్రమాదం పొంచి ఉందని మోడీ హెచ్చరించారు.

Khao Piyo Mauj Karo Is Not Indian Culture PM Modi Calls for Promoting Savings
Central Government Employees:
Central Government Employees:

2014లో పార్లమెంట్ లో తాను చేసిన మొదటి ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న మోడీ.. అప్పట్లో తన ప్రభుత్వం పేదలకు అంకితమైందని పేర్కొన్న విషయాన్ని మంత్రులకు మరోసారి గుర్తుచేశారు. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఇది జాతీయ వేడుకగా జరుపుకోదగిన మైలురాయి అని పేర్కొన్నారు. అయితే పేదరికం నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడం అనేది సవాలుగా ఒక భాగం మాత్రమే అని, వారు తిరిగి పేదరికం నుంచి జారిపోకుండా ఉండేందుకు నిరంతర కృషి అవసరమని హెచ్చరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా నక్సలిజం తరహాలోనే మాదవ ద్రవ్యాల దుర్వినియోగాన్ని సైతం అరికట్టాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+