వారణాసి లేటెస్ట్ వైరల్ వీడియో- గూస్ బంప్స్ పక్కా

ఎస్‌ఎస్ రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం.. వారణాసి. ఇది మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ వివరాలను యూనిట్ రహస్యంగా ఉంచుతోన్నప్పటికీ.. ఏదో ఒకరకంగా బయటికొస్తూనే ఉన్నాయవి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీ సమీపంలో నిర్మించిన భారీ వారణాసి సెట్ దృశ్యాలు యాపిల్ మ్యాప్స్‌లో ప్రత్యక్షం అయ్యాయి. గూస్ బంప్స్ తెప్పిస్తోన్నాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.

శాటిలైట్ మ్యాపింగ్ ను ఉపయోగిస్తూ సినిమా లొకేషన్‌ను గుర్తించారు.. నెటిజన్లు. సెట్ రూపురేఖలు, నిర్మాణం చాలా స్పష్టంగా కనిపిస్తోన్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాల లొకేషన్లలోకి బయటి వ్యక్తులను ఎవరినీ కూడా అనుమతించరు. యూనిట్ లో ఏ ఒక్కరికీ ఫోన్లు కూడా వాడనివ్వరు. అయినప్పటికీ.. ఈ డిజిటల్ మ్యాపింగ్ టెక్నాలజీ వల్ల సెట్ రూపురేఖలు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Mahesh Babu Varanasi Film has sparked a buzz after a video showing Kasi set spotted on Apple Maps

ఈ సినిమా మెజారిటీ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. హై ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీఐ, రీరికార్డింగ్, వివిధ భాషల్లో డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే క్యారెక్టర్ లో నటిస్తోన్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ ఫిల్మ్ రాబోయే ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది.

ఈ చిత్రం ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా సాగుతుందని సమాచారం. పురాతన నగరం వారణాసి, ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ఖండాల వంటి విభిన్న వాతావరణాల నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరించారు. భారతీయ ఇతిహాసం రామాయణంలోని శ్రీరాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగిన యుద్ధ ఘట్టాల ప్రేరణతో రూపొందించిన ప్రత్యేక సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+