ఏపీ తీర ప్రాంతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్.. కూటమి సర్కార్ బిగ్ ప్లాన్

స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను వేగంగా చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో విలువైన, అరుదైన ఖనిజ నిల్వలను గుర్తించి, వాటిని వెలికితీసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రంలో ఖనిజ సంపద ఉన్న పలు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించగా, వాటిని ఎలా వెలికితీయాలి, ఏయే ప్రణాళికలతో ముందుకెళ్లాలి అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశీయంగా కీలక ఖనిజాల అవసరాలు పెరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు రాష్ట్రానికి పెద్ద సానుకూలతగా మారుతున్నాయి. సుమారు 974 కిలోమీటర్ల తీరప్రాంతం వెంట ఉన్న బీచ్ ఇసుక నిల్వల్లో మోనజైట్, ఇల్మెనైట్, రూటైల్, జిర్కాన్ వంటి ఖనిజాలు లభిస్తాయి.

Rare Minerals in Andhra Pradesh Locations Exploration amp amp Strategic Plans of andhrapradesh government

మోనజైట్‌లోని అరుదైన మూలకాలు, టైటానియం ఆధారిత ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, పవన విద్యుత్ టర్బైన్లలోని అయస్కాంతాలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు ఎంతో కీలకం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించిన తీరప్రాంత బెల్ట్‌తో పాటు రాష్ట్రంలోని అంతర్భాగ ప్రాంతాల్లోనూ అరుదైన ఖనిజాలు, కీలక మూలకాల అన్వేషణపై దృష్టి పెట్టారు.

ఉదాహరణకు అనంతపురం ప్రాంతంలో లిథియం, టంగ్‌స్టన్, మాలిబ్డినం వంటి వనరులపై అన్వేషణలు, నెల్లూరు,కనిగిరి, పొదిలికొండ, చిత్తూరు,అన్నమయ్య పరిసరాల్లో అరుదైన ఖనిజాల జాడలు, ఉత్తరాంధ్రలోని విజయనగరం,శ్రీకాకుళం ప్రాంతాల్లో కోబాల్ట్, మాంగనీస్ వంటి ఖనిజాలపై జరిగిన సర్వేలు రాష్ట్ర ఖనిజ సామర్థ్యాన్ని చాటుతున్నాయి.

రాష్ట్రంలో ఖనిజ వనరుల అన్వేషణ, వేగవంతమైన వేలం ప్రక్రియలు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అరుదైన ఖనిజాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ఏర్పాటుకు చర్యలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా క్లస్టర్ల వారీగా ఖనిజ ప్రాంతాలను గుర్తించి ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలు ఈ రంగంలో వేగాన్ని పెంచుతున్నాయి.

విశాఖపట్నం, మచిలీపట్నం వంటి తీర ప్రాంతాల్లో ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల అవకాశాలను అందిపుచ్చుకుంటే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఖనిజాల వెలికితీతలో పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత జనావాసాల భద్రత, అనుమతుల ప్రక్రియలు, స్థానిక ప్రజల ప్రయోజనాలను సమతూకం చేయడం అత్యంత కీలకం. కేవలం ముడి ఖనిజాలను తరలించకుండా రాష్ట్రంలోనే శుద్ధి, విలువ ఆధారిత తయారీ యూనిట్లు ఏర్పాటైతేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+