PF Withdrawal: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా- ముహుర్తం ఫిక్స్..!

దేశవ్యాప్తంగా పీఎఫ్ చందాదారులైన ఉద్యోగులకు తాము దాచుకున్న మొత్తాల్ని వడ్డీతో కలిపి నేరుగా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సిద్దమైంది. ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈపీఎఫ్ఓ.. త్వరలో దీన్ని పూర్తి స్దాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోందన్న దానిపై స్పష్టత ఇచ్చింది.

UPI New Record: రోజుకు లక్ష కోట్లు దాటిపోయిన పేమెంట్స్..! చరిత్రలోనే సరికొత్త రికార్డు..!
UPI New Record: రోజుకు లక్ష కోట్లు దాటిపోయిన పేమెంట్స్..! చరిత్రలోనే సరికొత్త రికార్డు..!

యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో కలిసి ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ త్వరలో దాన్ని పూర్తి చేసి చందాదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం అర్హత ఉన్న చందాదారులు తమ పీఎఫ్ మొత్తాల్లో 75 శాతాన్ని యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఫిబ్రవరి నాటికి ఈపీఎఫ్ఓ 3.0 (EPFO 3.0) అమల్లోకి రానున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే యూపీఐ విత్ డ్రా సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

EPFO 3 0 PF Withdrawals Through UPI Expected to Start by December
PF చందాదారులకు భారీ గుడ్ న్యూస్- విత్ డ్రా విధానంలో కీలక మార్పులు..!
PF చందాదారులకు భారీ గుడ్ న్యూస్- విత్ డ్రా విధానంలో కీలక మార్పులు..!

ఈపీఎఫ్ఓ పీఎఫ్ చందాదారులు దాచుకున్న మొత్తాల్ని యూపీఐతో పాటు ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా క్లెయిమ్స్, పేపర్ వర్క్ భారాన్ని భారీ ఎత్తున తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ ఈ క్లెయిమ్స్ భారం కారణంగా అటు తమ ఉద్యోగులతో పాటు పీఎఫ్ చందాదారులు కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈపీఎఫ్ఓ గుర్తించింది. దీంతో త్వరలోనే వీటి నుంచి అందరికీ విముక్తి కల్పించబోతోంది. దీనికి కేవైసీ, యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది. అలాగే అవసరమైన రిస్క్ మేనేజ్ మెంట్ తనిఖీలు, ధృవీకరణలు పూర్తి చేసుకున్న క్లెయిమ్స్ మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిగ్గా ప్రాసెస్ అయి చందాదారుల బ్యాంకు ఖాతాల్లో అత్యంత వేగంగా నగదు జమ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+