UPI New Record: రోజుకు లక్ష కోట్లు దాటిపోయిన పేమెంట్స్..! చరిత్రలోనే సరికొత్త రికార్డు..!

దేశంలో నోట్ల రద్దు తర్వాత పుట్టుకొచ్చిన యూపీఐ లావాదేవీలు (UPI Transactions) సగటు భారతీయుల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పుడు ఆ ఆకర్షణ విలువ రోజుకు లక్ష కోట్లు దాటిపోయింది. గత నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో ఏకంగా 31.53 లక్షల కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగాయి. దీంతో భారతీయ యూపీఐ చరిత్రలో తొలిసారి నెలకు 30 లక్షల మార్క్ దాటిపోయాయి. భవిష్యత్తులో ఇవి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సీఈసీని వ్యతిరేకిస్తూ రాంలీలాకు దూరంగా ఆ పార్టీలు..! మోడీకి భయపడ్డాయా ?
సీఈసీని వ్యతిరేకిస్తూ రాంలీలాకు దూరంగా ఆ పార్టీలు..! మోడీకి భయపడ్డాయా ?

దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య ప్రతీ నెలా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 29.9 లక్షల కోట్ల మార్క్ నమోదు చేసి రికార్డు సృష్టించిన యూపీఐ చెల్లింపులు.. అక్టోబర్ నాటికి 31.53 లక్షల కోట్లకు చేరుకుని ఆ రికార్డును తిరగరాశాయి. అలాగే సెప్టెంబర్ లో రోజుకు 98 వేల కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. ఇది కాస్తా అక్టోబర్ కు వచ్చే సరికి రోజుకు లక్ష కోట్లు దాటిపోయింది.
అక్టోబర్ నెలలో చరిత్రలోనే తొలిసారి నెలకు 30 లక్షల కోట్ల లావాదేవీల మార్క్, రోజుకు లక్ష కోట్లకు పైగా లావాదేవీల మార్క్ దాటిపోయాయి. దీంతో యూపీఐ వ్యవస్థపై భారం అంతకంతకూ పెరిగిపోతోంది.

UPI payments Surge to Record High in October Daily Transactions Exceed 1 Lakh Crore
UPI Charges: పండుగల వేళ కేంద్రం ఊరట- ఛార్జీల మోతపై తాజా నిర్ణయం..!
UPI Charges: పండుగల వేళ కేంద్రం ఊరట- ఛార్జీల మోతపై తాజా నిర్ణయం..!

ఈ ఏడాది పండుగ సీజన్ కారణంగా యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే 31 రోజులున్న నెలలో యూపీఐ లావాదేవీలు అదనంగా నమోదు కావడం కూడా ఈ రికార్డుకు కలిసి వస్తోంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు సిద్దమైన కేంద్రం గత నెలలో దాన్ని పండుగల సీజన్ పేరుతో వాయిదా వేసింది. దీపావళి తర్వాత ఈ ఛార్జీలను విధించే అవకాశం ఉంది. వ్యాపారులకు చేసే 2 వేలకు మించిన చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. దీనిపై వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం వెనక్కుతగ్గేలా కనిపించడం లేదు. యూపీఐ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఈ ఛార్జీలు తప్పనిసరి అని చెబుతోంది. ఈ ఛార్జీల విధింపు తర్వాత కూడా కేంద్రం అదనపు సాయం అందిస్తే తప్ప యూపీఐ వ్యవస్థ నడిచే అవకాశం లేదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+