కార్తిక పౌర్ణమి వేళ అన్నవరం గిరి ప్రదక్షిణ కు భారీ ఏర్పాట్లు- రూట్, టైమింగ్స్..!!

కార్తీక పౌర్ణమి రోజున అన్నవరంలో అద్భుత మైన ఘట్టం. పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో నిర్వహించే గిరి ప్రద క్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. ఇందుకు సంబంధించి వేళల ను ప్రకటించారు. మొత్తం 8.2 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ ప్రదక్షిణ లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన సూచనలను అధికారులు వెల్లడించారు.

కార్తిక పౌర్ణమి వేళ రేపు (మంగళవారం)అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో నిర్వహించే గిరి ప్రద క్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసారు. రేపు ఉదయం 8 గంటలకు కొండ పై నుంచి స్వామివారు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఉదయం 8 గంటలకు కిందకు తీసుకొచ్చి తిరుచ్చిపై ఉంచుతారు. ప్రత్యేక పూజల తరువాత గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది.

Annavaram Arrangements Completed for Giri Pradakshina at Sri Veera Venkata Satyanarayana Swamy Temple

ఈ ప్రదక్షిణ అన్నవరంలోని తొలి పావంచాల వద్ద ప్రారంభమై తిరిగి అదే ప్రాంతానికి చేరుకోవడం తో ముగుస్తుంది. మొత్తం 8.2 కిలోమీటర్ల మేర ఈ ప్రదక్షిణ కొనసాగుతుంది. కాగా.. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు పలు ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించనున్నారు. సుబ్రమణ్య స్వామి ఆలయం, సుబ్బరాయపురం, సాక్షిగణపతి ఆలయం మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటుంది.

కాగా, అక్కడి నుంచి బెండపూడి సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం వరకు కొనసాగుతుంది. అనంతరం పంపా రిజర్వాయర్‌ నుంచి రత్నగిరి, సత్యగిరి కొండల ఘాట్ మార్గం మీదుగా దిగువ ఘాట్‌రోడ్డుకు చేరుకుని తిరిగి తొలిపావంచాల వద్దకు వస్తారు. ఈ గిరిప్రదక్షిణ మొత్తం 8.2 కిలోమీటర్ల దూరం ఉండగా, అందు లో 3.9 కిలోమీటర్లు తారురోడ్డు, మరో 4.3 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంది.

భక్తులు చెప్పులు లేకుండా నడిచే సమయంలో రాళ్లు గుచ్చుకోకుండా మార్గాన్ని చదును చేస్తున్నారు. ప్రతి కిలో మీటర్‌కు దేవస్థానం అధికారులు, సిబ్బందిలో ఒకరు అందుబాటులో ఉండి భక్తులకు అవసర మైన సహాయం అందించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో కొండ దిగువన తొలిపావంచాల వద్ద సత్యరథం ప్రారంభమవుతుంది. యంత్రం 6 గంటలకు పంపా హారతులు, రాత్రి 7.30 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+