పిఠాపురం జనసేనలో అసమ్మతి, వైస్ ఛైర్మన్ పదవి రచ్చ- ఎంపీ పీఏపై దాడి..!!

పవన్ సొంత నియోజకవర్గంలో జనసేనలో అసమ్మతి బయట పడింది. పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వేళ వివాదం దాడుల వరకు వెళ్లింది. పార్టీ ప్రకటించిన అభ్యర్ధికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే రోడ్డెక్కారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పీఏ పైన దాడి చేసారు. మున్సిపల్ ఆఫీసు దగ్గర ఎంపీకి వ్యతిరేకంగా భైఠాయించి నిరసనకు దిగారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామాల పై పార్టీ నాయకత్వం ఆరా తీస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జనసేన లోనే వర్గ పోరు తెర మీదకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్పోరేషన్లు - మున్సిపాల్టీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు - అదే విధంగా మున్సిపల్ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. కూటమి లోని మూడు పార్టీలు సీట్ల పంపకాలకు అనుగుణంగా తమ అభ్యర్ధులను ప్రకటించారు. అందులో భాగంగా పిఠాపురం నుంచి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా పార్టీ బొజ్జ వెంకటేశ్వరరావు పేరు ప్రకటన చేసింది. మున్సిపాల్టీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, కూటమి నుంచి 25 మంది ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. అందులో జనసేన సభ్యుల సంఖ్య 18గా ఉంది. అయితే, వెంకటేశ్వర రావు పేరు ప్రతిపాదన పైన జనసేనలోని కౌన్సిలర్లు విభేదించారు. సంధ్య వైస్ ఛైర్మన్ గా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
pithapuram-jana-sena-faces-internal-rift-over-municipal-vice-chairman-candidate-details-here

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై ఆగ్రహం

పార్టీ ప్రకటించిన బొజ్జ వెంకటేశ్వర రావు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చారని.. పవన్ పిఠాపురం నుంచి పోటీ సమయంలోనూ వ్యతిరేకంగా వ్యవహరించారని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పైన మండిపడుతున్నారు. ఎంపీ పీఏ చక్రీ పైనా దాడికి ప్రయత్నించారు. పిఠాపురం మున్సిపాల్టీ వద్ద భైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా పార్టీ కౌన్సిలర్లు నినాదాలు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కౌన్సిలర్ సంధ్యకు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని అసమ్మతి కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో, పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. కౌన్సిలర్ల డిమాండ్ మేరకు పార్టీ వైస్ ఛైర్మన్ విషయంలో నిర్ణయం మార్పు చేస్తుందా.. ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా అనేది ఇప్పుడు పిఠాపురంలో ఆసక్తిగా మారుతోంది. కాగా.. తాజా పరిణామాల పైన పార్టీ నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+