ఆర్టీసీ బస్సుల్లో ఏఐ నిఘా: డ్రైవర్ తప్పు చేస్తే బస్‌భవన్‌కు వీడియో.. జరిగేదిదే!

ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త సాంకేతిక అడుగు వేసింది. డ్రైవర్ల ఏమరుపాటు, నిద్రమత్తు, మానవ తప్పిదాల వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించే లక్ష్యంతో ఆర్టీసీ బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాల నిఘాను ప్రవేశపెట్టింది.

ఇందుకోసం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, దూరప్రాంతాలకు నడిచే బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనే రెండు ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమర్చింది. బస్సు లోపల అమర్చిన డీఎంఎస్ కెమెరా డ్రైవర్ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉంటుంది.

TGSRTC AI cameras RTC Introduces AI Cameras in Buses 10-Second Video Alert to Bus Bhavan on Driver Negligence

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం, నిద్రమత్తులోకి జారుకోవడం, రోడ్డుపై కాకుండా ఇతర వైపులా చూడటం, పొగతాగడం లేదా అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వ్యవస్థ తక్షణమే పసిగడుతుంది. ఉల్లంఘన జరిగిన వెంటనే ఆ ఘటనకు సంబంధించిన 10 సెకన్ల వీడియో క్లిప్ నేరుగా బస్‌భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది.

దీనివల్ల అధికారులు లైవ్‌లో డ్రైవర్ పరిస్థితిని పరిశీలించి, వెంటనే అలర్ట్ చేయడం ద్వారా జరగబోయే ప్రమాదాన్ని అక్కడికక్కడే అడ్డుకునే వీలు కలుగుతుంది. మరోవైపు బస్సు వెలుపల ఉండే అడాస్ కెమెరాలు రహదారిపై ఎదురయ్యే ముప్పులను ముందే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి. ముఖ్యంగా బస్సు ముందు భాగంలో డ్రైవర్ కంటికి నేరుగా కనిపించని 'బ్లైండ్ స్పాట్ల' నుంచి పాదచారులు గానీ, ఇతర వాహనాలు గానీ అకస్మాత్తుగా అడ్డువచ్చినప్పుడు ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.

ఫలితంగా డ్రైవర్ వేగాన్ని నియంత్రించి బస్సును సురక్షితంగా నడిపేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్-1, హైదరాబాద్-2, పికెట్, బీహెచ్‌ఈఎల్ డిపోలకు చెందిన 200 దూరప్రాంత మరియు అంతర్రాష్ట్ర బస్సుల్లో ఈ ఏఐ నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు నమోదైన ఉల్లంఘనలలో దాదాపు 66.6 శాతం ఒక్క బీహెచ్‌ఈఎల్ డిపో బస్సుల నుంచే గుర్తించినట్లు ఆర్టీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గోకులవనంలో ప్రకృతి వివాహం: పెళ్లి విందు చాలా ప్రత్యేకం!
గోకులవనంలో ప్రకృతి వివాహం: పెళ్లి విందు చాలా ప్రత్యేకం!

ఈ ఏఐ కెమెరాలు సుమారు 90 శాతం కచ్చితత్వంతో ఉల్లంఘనలను గుర్తిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరలో క్యూర్‌ పరిధిలోకి వచ్చే 2200 ఎలక్ట్రిక్‌ బస్సులకూ విస్తరించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా నమోదయ్యే డేటా ఆధారంగా ప్రతి డ్రైవర్‌కు ప్రత్యేకంగా పనితీరు స్కోరు కేటాయిస్తున్నారు. తక్కువ స్కోరు వచ్చిన డ్రైవర్లను గుర్తించి వారికి శిక్షలు విధించడానికి బదులుగా, ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తూ వారి డ్రైవింగ్ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+