పట్టాలెక్కిన సరయూ ఎక్స్‌ప్రెస్: భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేరుగా నేపాల్ కు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్య, నేపాల్‌లోని సీతాదేవి జన్మస్థలం జనక్‌పూర్‌ను నేరుగా అనుసంధానిస్తూ నూతనంగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్ దీనికి పేరు పెట్టారు. భారత్- నేపాల్ మధ్య ఓ రైలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా.. భారత్, నేపాల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బాలేంద్ర షా కొద్దిసేపటి కిందటే ఢిల్లీ నుంచి వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు.

అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం.. ఇరుదేశాల ఆధ్యాత్మిక అనుబంధంలో ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ నూతన రైలు సర్వీసు భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఊతం ఇవ్వనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PM Modi and Nepalese PM Balendra Shah virtually flag off train from Ayodhya to Janakpur in Nepal

ఈ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28వ తేదీ నుంచి సాధారణ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌ను విద్యుత్ దీపాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు. ఈ ఘట్టాన్ని కళ్లారా తిలకించడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. రైలు ప్రారంభోత్సవ కార్యక్రామన్ని హర్షధ్వానాలతో స్వాగతించారు.

భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేపాల్ కు డైరెక్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్- 10 హాల్ట్ స్టేషన్లు
భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేపాల్ కు డైరెక్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్- 10 హాల్ట్ స్టేషన్లు

అయోధ్య కంటోన్మెంట్ నుంచి జనక్‌పూర్ వరకు మొత్తం 604 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు సుమారు 19 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలు ఉత్తర ప్రదేశ్, బీహార్ మీదుగా నేపాల్ లోకి ప్రవేశిస్తుంది. అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. గోరఖ్‌పూర్, పనియహవా, నర్కటియాగంజ్, సీతామఢీ, జయ్‌నగర్ మీదుగా జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. రామాయణ గాథలో విశేష ప్రాధాన్యత ఉన్న సీతామఢీ మీదుగా ఈ రైలు వెళ్లడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక యాత్ర ఎంతో సులభతరం కానుంది.

వారణాసి లేటెస్ట్ వైరల్ వీడియో- గూస్ బంప్స్ పక్కా
వారణాసి లేటెస్ట్ వైరల్ వీడియో- గూస్ బంప్స్ పక్కా
  • ప్రతి సోమవారం సాయంత్రం అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 12:40 నిమిషాలకు జనక్ పూర్ ధామ్ కు చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 1:10 నిమిషాలకు జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరే మరో ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 8:10 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది.
  • బీహార్ లోని జయానగర్, సీతామఢి, మధుబని, శీషో, రక్సౌల్, నరకటియాగంజ్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, బస్తీ, మన్ కా పూర్ స్టేషన్ల గుండా అయోధ్య కంటోన్మెంట్ కు రాకపోకలు సాగిస్తుందీ ఎక్స్ ప్రెస్.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+