భారత్ లోని ఈ స్టేషన్ నుంచి నేపాల్ కు డైరెక్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్- 10 హాల్ట్ స్టేషన్లు

భారత్, నేపాల్ మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం కానున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఓ వీక్లీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రాబోతోంది. నేపాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సీతమ్మ తల్లి జన్మస్థలం జనక్‌పుర్‌, శ్రీరాముడి జన్మభూమి ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య మధ్య నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కాబోతోంది. దీనికి రైల్వేబోర్డు ఆమోదం సైతం తెలిపింది. రామాయణంతో ముడిపడి ఉన్న ఈ రెండు పవిత్ర క్షేత్రాల మధ్య రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయోధ్య- జనక్ పూర్ మధ్య దూరం సుమారు 604 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రూట్ ఖరారైంది కూడా. ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది. మొత్తం 10 స్టేషన్లల్లో దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. ఈ రైలు టైమింగ్స్, టికెట్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన భారత్, నేపాల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బాలేన్ షా వర్చువల్ విధానంలో సంయుక్తంగా ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Railways has approved a new weekly express train connecting Janakpur in Nepal with Ayodhya Cantt UP

ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి శనివారం జనక్‌పుర్ నుండి, తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం అయోధ్య కంటోన్మెంట్ నుండి ఈ రైలు బయలుదేరుతుంది. జనక్‌పుర్ ధామ్ నుండి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు.. బీహార్ లోని జయానగర్, సీతామఢి, మధుబని, శీషో, రక్సౌల్, నరకటియాగంజ్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, బస్తీ, మన్ కా పూర్ స్టేషన్ల గుండా అయోధ్య కంటోన్మెంట్ కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

ఈ ఎక్స్ ప్రెస్ రైలు సమయ వేళలు, టికెట్ ధరలు, ట్రైన్ నంబర్లు, అడ్వాన్స్ బుకింగ్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది. ఈ నూతన రైలు అందుబాటులోకి రావడం వల్ల భారత్-నేపాల్ మధ్య పర్యాటకం గణనీయంగా పుంజుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి రామాయణ సర్క్యూట్ ఆధారిత పర్యాటక రంగానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

టీమిండియా మళ్లీ ఫ్లాప్ షో
టీమిండియా మళ్లీ ఫ్లాప్ షో

విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ అవసరాల కోసం ఇరు దేశాల మధ్య ప్రయాణించే వారికి కూడా ఈ సర్వీసు ఉపకరిస్తుంది. హిమాలయాలను మరింత దగ్గరగా చూడాలనుకునే వారికి ఈ రైలు దోహదపడుతుంది. దీని ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకం, హోటల్స్, చేతివృత్తుల కళాకారులు, స్థానిక వర్తకులకు నూతన అవకాశాలు లభించినట్టవుతుంది. వైద్య అవసరాల కోసం భారత్ రావాలనుకునే నేపాల్ ప్రజలకు ఈ ఎక్స్ ప్రెస్ ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+