బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో సచిన్ టెండూల్కర్ కూతురు పెళ్లి!
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసి, మోడలింగ్, న్యూట్రిషన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తరచూ తన ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకునే ఆమె గురించి తాజాగా ఓ పెళ్లి రూమర్ వేగంగా వైరల్ అవుతోంది.
సన్నీడియోల్ చిన్న కుమారుడితో
గత కొంతకాలంగా సారా పేరు టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ముడిపెడుతూ రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ చర్చ పక్కకు వెళ్లి, కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ నటుడు రాజ్వీర్ డియోల్‌తో సారా వివాహం జరగనుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఆ చర్చ పెళ్లి దాకా వెళ్లిందంటూ రెడ్డిట్ సహా పలు వేదికలపై పోస్టులు కనిపిస్తున్నాయి. 2023లో వచ్చిన 'దోనో' సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్వీర్తో వచ్చే ఏడాది సారా పెళ్లి జరిగే అవకాశం ఉందంటూ నెటిజన్లు అంచనాలు వేస్తున్నారు.

అధికారిక ప్రకటన రాలేదు
అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సారా, రాజ్‌వీర్‌ల పెళ్లి ఖరారైందంటూ సోషల్ మీడియాలో వదంతులు వేగంగా వ్యాపించినప్పటికీ, సచిన్ కుటుంబం నుంచి గానీ, డియోల్ కుటుంబం నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా ఈ వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని సచిన్ సన్నిహిత వర్గాలు కొట్టిపారేసినట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనా, సినిమాల్లోకి రాకపోయినా మోడలింగ్, లైఫ్‌స్టైల్ అప్డేట్స్తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సారా చుట్టూ ఇలాంటి రూమర్లు రావడం ఇదే మొదటిసారి కాదు. అధికారిక సమాచారం వచ్చేవరకు వీటిని కేవలం సోషల్ మీడియా చర్చలుగానే చూడాలి.












Click it and Unblock the Notifications
