హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రద్దీ రహదారులపై ‘కంజెషన్ ఛార్జీలు', పైలెట్ ప్రాజెక్ట్ అక్కడే!

విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 'కంజెషన్ ప్రైసింగ్' ట్రాఫిక్ రద్దీ రుసుము విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని తాజా అధ్యయనం ఒకటి సూచించింది.

బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫహద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ పరిశోధకులు కేంద్ర ప్రభుత్వ నిధులతో సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 435 మంది కార్ల ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించగా, ప్రయాణ సమయం ఆదా అవుతుందని, వసూలు చేసిన రుసుమును ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి వినియోగిస్తామని భరోసా ఇస్తే ఈ విధానానికి మద్దతు ఇచ్చేందుకు వాహనదారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడైంది.

Hyderabad Traffic Solution BITS Pilani Study Recommends Congestion charges pilot project in IT Corridor

ముఖ్యంగా ఐటీ కంపెనీలు, వాణిజ్య సముదాయాలు, మెట్రో స్టేషన్లు ఉన్న హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌ను పైలట్ ప్రాజెక్టుకు అత్యంత అనువైన ప్రాంతంగా రవాణా నిపుణులు గుర్తించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల గణాంకాల ప్రకారం, సైబర్ టవర్స్ మీదుగా గంటకు పది వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీటిలో దాదాపు 6,550 కార్లలో కేవలం డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తుండగా, మరో 3,500 కార్లలో ఇద్దరు మాత్రమే ఉంటున్నారు.

హైటెక్ సిటీ ప్రధాన మార్గంలో నిత్యం సుమారు 1.5 లక్షల వాహనాలు తిరుగుతుండటంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కేవలం రోడ్లను విస్తరించడం వల్లే ట్రాఫిక్ సమస్య తీరదని బిట్స్ పిలానీ పరిశోధకులు ప్రొఫెసర్ ప్రసాంత్ సాహు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పులో అసమానతలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, ఎక్కడపడితే అక్కడ పార్కింగ్, బస్టాపుల వద్ద అస్తవ్యస్త పరిస్థితులు, శాస్త్రీయత లేని జంక్షన్లే ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు.

అవసరమైన చోట గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్లు నిర్మించి, బాటిల్‌నెక్ ప్రాంతాలను చక్కదిద్దాలని అధ్యయనం పేర్కొంది. మరోవైపు, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ శాస్త్రవేత్త టి. సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ, రద్దీ సమయాల్లో కారులో ముగ్గురి కంటే తక్కువ మంది ప్రయాణిస్తే అదనపు రుసుము విధించే 'హై ఆక్యుపెన్సీ వెహికల్'విధానాన్ని ఏఎన్‌పీఆర్ కెమెరాల సాయంతో అమలు చేయవచ్చని సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో ఏఐ నిఘా: డ్రైవర్ తప్పు చేస్తే బస్‌భవన్‌కు వీడియో.. జరిగేదిదే!
ఆర్టీసీ బస్సుల్లో ఏఐ నిఘా: డ్రైవర్ తప్పు చేస్తే బస్‌భవన్‌కు వీడియో.. జరిగేదిదే!

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో వాహనాల సంఖ్య 2024లో 89.89 లక్షలుగా ఉండగా, 2025 నాటికి 94.78 లక్షలకు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య కోటి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంజెషన్ ఛార్జీల ద్వారా సమకూరే నిధులను మెట్రో ఫీడర్ బస్సులు, సురక్షితమైన పాదచారుల బాటలు, కాలుష్య రహిత ప్రజా రవాణా కోసం ఖర్చు చేస్తేనే ప్రజల ఆదరణ లభిస్తుందని ప్రొఫెసర్ బంధన్ మజుందార్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+