'బిచ్చగాడు' హీరోకు ఏమైంది..? జనరల్ బోగీలో ఇలా ప్రయాణిస్తూ..!
సినీ ఇండస్ట్రీలో అనేకమంది నటీనటులు ఉంటారు. మంచి మంచి క్యారెక్టర్స్ తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా నటించాలని తపనపడుతుంటారు. అలా చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోలుగా మారిన వాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఇక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినవాళ్లూ ఇండస్ట్రీలో మనకు కనిపిస్తుంటారు. అయితే అలాంటివారిలో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ముందుంటారు.

2012లో నాన్, 2014 లో సలీమ్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 2016 లో వచ్చిన బిచ్చగాడు చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాక ఈ మూవీతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత యమన్, అన్నాదురై, కాళి, తిమురుపుడిచవన్, బిచ్చగాడు 2 లాంటి చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత 2024 లో హిట్లర్, రోమియో తో పాటు 2025 లో మార్గన్, శక్తి తిరుమగన్ సినిమాలు అలాగే 2026 లో నూరు సామి, అప్పా కుట్టి తదితర సినిమాలు చేశారు.
Vijay Antony travelled in an unreserved coach 🤯 https://t.co/ftMkQYOHp8
— Ayyappan (@Ayyappan_1504) November 21, 2026
ప్రస్తుతం ఆయన అప్పా కుట్టి ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తెలుగులో నాన్న కుట్టి అనే టైటిల్ తో రానుంది. అయితే ఈ మూవీకి మరింత ప్రొమోషన్స్ చేయాలని భావించిన విజయ్.. తన చిత్ర బృందంతో కలిసి చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో సామాన్య ప్రజల మధ్యలో ఇలా జనరల్ బోగీలో ప్రయాణం చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రాని జంటగా నటించిన 'అప్పా కుట్టి' మూవీ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ నవంబర్ 20 న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
