ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు కొత్త సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో..

టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు గతేడాది 'కన్నప్ప' సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో జూన్ 27న విడుదలైన ఆ మూవీ ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంచు విష్ణు. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారు.

మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు ప్రభుదేవా. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. దాంతో ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ప్రభుదేవా డాన్స్ మాస్టర్‌ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగానూ పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. అందులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. పౌర్ణమి సినిమాలు ఉన్నాయి. మరోవైపు తాజాగా విష్ణు కెరీర్‌ లో 24వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ కు VM24 అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. అయితే సినిమా కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

ManchuVishnu latest A new movie for Manchu Vishnu directed by Prabhu Deva a pan India scale

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక కన్నప్ప సినిమాకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయం నుంచే ఇరువురి మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+