ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన కిమ్ నిర్ణయం.. భారత్‌కు ఎందుకింత ప్రాధాన్యం?

అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో భారత నూతన రాయబారి సంజీవ్ జైన్‌తో పాటు మొత్తం 10 దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. గత 30 ఏళ్ల ఉత్తర కొరియా చరిత్రలో విదేశీ రాయబారుల నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌తో దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలనే ఉత్తర కొరియా ఆకాంక్షకు ఈ భేటీ నిదర్శనంగా నిలుస్తోంది.

ఒక్క భేటీతో ఆ దేశానికి జాక్‌పాట్.. భారత ప్రధాని మోదీ ఇచ్చిన వరాలేంటి?
ఒక్క భేటీతో ఆ దేశానికి జాక్‌పాట్.. భారత ప్రధాని మోదీ ఇచ్చిన వరాలేంటి?

వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక వేడుక
ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ప్యాంగ్యాంగ్‌లోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కేంద్ర కమిటీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తర కొరియాలో భారత రాయబారిగా నియమితులైన సంజీవ్ జైన్ తన నియామక పత్రాన్ని కిమ్ జోంగ్ ఉన్‌‌కు సమర్పించారు. భారత్‌తో పాటు రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, స్వీడన్ , వియత్నాం, చెక్ రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన నూతన రాయబారులు కూడా కిమ్‌కు తమ పరిచయ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి చో సోన్ హుయ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాయబారులందరితో కలిసి కిమ్ జోంగ్ ఉన్ గ్రూప్ ఫోటో కూడా దిగారు.

Kim Jong Un Meets Indian Ambassador Sanjeev Jain in Pyongyang in Rare Diplomatic Move Read full details

భారత్-ఉత్తర కొరియా సంబంధాల నేపథ్యం
భారత్, ఉత్తర కొరియా దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొరియా యుద్ధ సమయంలో భారత్ పోషించిన మధ్యవర్తిత్వ పాత్ర, అలీన ఉద్యమం నాటి నుంచే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 1962 మార్చి 1న కాన్సులర్ స్థాయి సంబంధాలు ప్రారంభం కాగా.. 1973 డిసెంబర్ 10న ప్యాంగ్యాంగ్‌లో భారత కార్యాలయం ఏర్పాటైంది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2015లో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి భారత్‌కు రాగా.. 2018లో అప్పటి భారత విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఉత్తర కొరియాలో పర్యటించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 జులైలో తాత్కాలికంగా మూసివేసిన ప్యాంగ్యాంగ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని, సుదీర్ఘ విరామం తర్వాత 2024 డిసెంబర్లో తిరిగి ప్రారంభించారు.

Ind vs NZ: భారత బ్యాటర్ల చారిత్రక ఫీట్- 94 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..!
Ind vs NZ: భారత బ్యాటర్ల చారిత్రక ఫీట్- 94 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..!

రాయబారులకు కిమ్ జోంగ్ ఉన్ భరోసా
ఈ కార్యక్రమంలో విదేశీ రాయబారులను ఉద్దేశించి కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఆయా దేశాల అధినేతలకు, ప్రజలకు తన తరఫున శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలు, ఉత్తర కొరియా నిబంధనల ప్రకారం రాయబారులకు పూర్తిస్థాయి దౌత్యపరమైన రక్షణ, అధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నూతన రాయబారులు తమ దేశాలు, ఉత్తర కొరియా మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తూ.. స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+