టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన నిర్ణయం.. ఎన్విడియా బాస్‌గా మళ్లీ జెన్సెన్ హువాంగ్!

ప్రపంచ దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనా గూఢచర్య కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో రాజీనామా చేసిన జెన్సెన్ హువాంగ్ కేవలం 11 రోజుల్లో తిరిగి కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆయన రాజీనామాను ఆమోదించిన తమ మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్విడియా బోర్డు తాజాగా ప్రకటించింది. జెన్సెన్ హువాంగ్‌ను తిరిగి కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో, బోర్డు డైరెక్టర్‌‌గా ఏకగ్రీవంగా నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్విడియా సంస్థ స్పష్టం చేసింది.

నా తప్పులు తెలుసుకున్నా.. తిరిగి సీఈఓగా రావడానికి సిద్ధంగా ఉన్నా: జెన్సన్​ హువాంగ్ సంచలనం
నా తప్పులు తెలుసుకున్నా.. తిరిగి సీఈఓగా రావడానికి సిద్ధంగా ఉన్నా: జెన్సన్​ హువాంగ్ సంచలనం

సంప్రదింపుల అనంతరమే నిర్ణయం
జెన్సెన్ హువాంగ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం.. ఆయన డైరెక్టర్ల వద్ద అన్నివిషయాలను నిజాయితీగా వెల్లడించారని బోర్డు నిర్ధారణకు వచ్చింది. ఈ చిప్ తయారీ దిగ్గజ సంస్థను నడిపించడానికి ఆయనే సరైన వ్యక్తి అని బోర్డు అభిప్రాయపడింది. ఈ తుది నిర్ణయం తీసుకునే ముందు అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఎన్విడియా ఓ ప్రకటనలో తెలిపింది.

Jensen Huang Reinstated as Nvidia CEO Just 11 Days After Resignation Over Spy Affair Full Details Here

ఈ సందర్భంగా ఎన్విడియా బోర్డు ఛైర్మన్ హార్వే సి.జోన్స్ మాట్లాడుతూ.. "ఎన్విడియాను నడిపించడానికి జెన్సెన్ హువాంగ్ సరైన వ్యక్తి అని బోర్డు పూర్తిగా విశ్వసిస్తోంది. ఆయన రీ-ఎంట్రీ మా వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుంది. జెన్సెన్ హువాంగ్ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని పేర్కొన్నారు.

ఒక్కరే సినిమా తీస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్‌లో కొత్త ప్రయోగం!
ఒక్కరే సినిమా తీస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్‌లో కొత్త ప్రయోగం!

కొలెట్ క్రాస్ తాత్కాలిక బాధ్యతలకు ముగింపు
జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన కొలెట్ క్రెస్ పదవీకాలం ఈ నిర్ణయంతో ముగిసింది. ఆమె తిరిగి ఎన్విడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలను కొనసాగిస్తారని బోర్డు వెల్లడించింది. సంక్షోభ సమయంలో సంస్థను సమర్థవంతంగా నడిపించినందుకు బోర్డు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

తిరిగి పనిలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నా: జెన్సెన్ హువాంగ్
తన రీ-ఎంట్రీపై జెన్సెన్ హువాంగ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "ఓ కొత్త పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ఎన్విడియాకు తిరిగి రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అత్యంత వినయంతో, సరికొత్త నిబద్ధతతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ నిర్ణయం తీసుకున్న బోర్డుకు థ్యాంక్స్. తిరిగి పనిలో నిమగ్నమయ్యేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని జెన్సెన్ హువాంగ్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్విడియా నాయకత్వ సంక్షోభం, జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీతో ముగిసినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+