నా తప్పులు తెలుసుకున్నా.. తిరిగి సీఈఓగా రావడానికి సిద్ధంగా ఉన్నా: జెన్సన్​ హువాంగ్ సంచలనం

ప్రపంచ ప్రఖ్యాత చిప్‌ తయారీ సంస్థ ఎన్​విడియా సీఈఓ పదవికి ఇటీవల జెన్సన్​ హువాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 33 ఏళ్ల పాటు ఎన్​విడియా సంస్థకు నాయకత్వం వహించిన జెన్సన్​ హువాంగ్.. ఆయన​ వివాహేతర సంబంధాలపై దుమారం రేగిన వేళ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే సీఈఓ పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన మౌనం వీడారు. ఎన్​విడియా సీఈఓగా తిరిగి బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలో బోర్డు తీసుకునే నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు.

అంతేకాక తాను చేసినవి తీవ్రమైన తప్పులుగా భావిస్తున్నట్లు జెన్సన్​ హువాంగ్ పేర్కొన్నారు. తన కారణంగా సంస్థకు ఇబ్బందులు ఎదురైతే తనను క్షమించాలని స్పష్టం చేశారు. అలాగే తనపై ఎన్​విడియా బోర్డు చేపట్టిన విచారణ, దర్యాప్తునకు తాను పూర్తిగా సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక తాను రాజీనామా చేసినప్పటి నుంచి తనకు సంస్థలోని ఉద్యోగులతోపాటు స్నేహితుల నుంచి వస్తున్న మద్దతు, ఓదార్పు, ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

JensenHuang Return Nvidia CEO Jensen Huang Ready to return as Nvidia CEO Key remarks Jensen Huang

దాంతోపాటు సంస్థలోని పెట్టుబడిదారులు, ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు.. తాను మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు జెన్సన్​ హువాంగ్ తెలిపారు. ఇక కొత్త సీఈఓపై ఎన్​విడియా బోర్డు కసరత్తులు చేస్తున్న సమయంలో జెన్సన్​ హువాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్​విడియా సంస్థకు తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రెస్ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఇక 33 ఏళ్ల పాటు ఎన్​విడియా కంపెనీని నడిపించి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్‌ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిపారు మాజీ సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌. ఈ క్రమంలో ఆయన మరోసారి బాధ్యతలు చేపట్టాలని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+