భారత్ కు ఊహించని షాక్.. ఏకంగా 84 వ స్థానానికి పడిపోయిందిగా..!
హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ - 2026 రిపోర్ట్ వచ్చేసింది. ప్రయాణాలకు అత్యంత స్నేహ పూరితంగా ఉండేలా పాస్ పోర్టులు ఇచ్చే దేశాలను ఈ సూచీలో పేర్కొంటారు. అలాగే ముందస్తు వీసా అవసరం లేకుండా ఒక దేశ పౌరులు ఎన్ని గమ్య స్థానాలకు వెళ్లవచ్చనే సంఖ్య ఆధారంగా ర్యాంకులను రూపొందిస్తుంటారు. అయితే తాజాగా వెల్లడైన ఈ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ 84వ స్థానానికి పడిపోయింది. గతేడాది అక్టోబర్ లో 80 వ స్థానంలో భారత్ ఉంది.
అయితే ఈ ఏడాది మరో నాలుగు స్థానాలను కోల్పోయింది. మరోవైపు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో సింగపూర్ తొలి స్థానంలో కొనసాగుతోంది. సింగపూర్ పాస్ పోర్టు కలిగిన వాళ్లు ఏకంగా 193 దేశాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, సౌత్ కొరియా, యూఏఈ ఉన్నాయి. ఇక మూడో స్థానంలో స్వీడన్ ఉంది. నాలుగో స్థానంలో పలు యూరోపియన్ దేశాలు ఉన్నాయి. భారత్ మాత్రం 84 స్థానానికి పడిపోయింది. ఇక భారత్ పాస్ పోర్టు కలిగిన వాళ్లు 58 దేశాలకు వెళ్లవచ్చు.

ఇక జోట్వానీ అసోసియేట్స్, అడ్వకేట్ పాలక్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ లో అక్రమ వలసలు, వీసా గడువునకు సంబంధించిన ఉల్లంఘనలు, విదేశీ ప్రయాణికులపై తనిఖీలు పెంపు తదితర కారణాలతో భారత పాస్ పోర్టు బలహీనపడటానికి కారణంగా భావించవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ - 2026 రిపోర్ట్ లో పాకిస్థాన్ ర్యాంక్ 101 గా ఉంది. పాకిస్థాన్ పాస్ పోర్టు కలిగినవాళ్లు కేవలం 29 దేశాల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. ఈ మేరకు తాజాగా ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్ ల జాబితాలో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు భారత్ కంటే పాకిస్థాన్ 17 స్థానాలు వెనకబడి ఉంది.












Click it and Unblock the Notifications
