ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రైల్వే అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోన్నారు. దసరా, దీపావళి, ఛత్ పూజ వేళ.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్పెషల్ రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఈ రైళ్లన్నీ కూడా అక్టోబర్ నుండి డిసెంబర్ మొదటివారం వరకూ రాకపోకలు సాగిస్తాయి.

ఈ క్రమంలో తాజాగా ప్రత్యేక రైలును ప్రకటించారు. ఏపీ మీదుగా అస్సాంలోని తిన్ సుకియా నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ఇది. మొత్తం 12 ట్రిప్పులు నడుస్తుంది. మొదటి రైలు అక్టోబర్ 8వ తేదీన పట్టాలెక్కుతుంది. నవంబర్ 16వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తుంది. పండగ సీజన్, ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎక్స్ ప్రెస్ వివరాలివీ.

Railways Plans to run Special Trains between New Tinsukia and SMVT Bengaluru to clear Extra rush

అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5, 12 తేదీల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:45 నిమిషాలకు తిన్ సుకియా నుంచి బయలుదేరే నంబర్ 05952 ప్రత్యేక రైలు నాలుగో రోజు ఉదయం 9: 30 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది.

భారత గ్యాంగ్‌స్టర్ ఆచూకీ ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డ్ ప్రకటించిన అమెరికా: మోస్ట్ వాంటెడ్ లిస్ట్
భారత గ్యాంగ్‌స్టర్ ఆచూకీ ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డ్ ప్రకటించిన అమెరికా: మోస్ట్ వాంటెడ్ లిస్ట్

తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రతి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12:05 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 05951 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 4: 25 నిమిషాలకు తిన్ సుకియాకు చేరుకుంటుంది.

వాస్తు ప్రకారం.. ఇంటి పూజా గదిలో ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం.. ఇంటి పూజా గదిలో ఉంచకూడని వస్తువులు

దిబ్రూగఢ్, ధెమాజీ, నార్త్ లఖింపూర్, హర్ముటి, విశ్వనాథ్ చరాలీ, రంగపారా నార్త్, రంగియా, బర్పెట రోడ్, న్యూ కోక్రాఝర్, న్యూ కూచ్ బెహార్, అలువాబరి, కిషన్ గంజ్, న్యూ ఫరక్కా, రామ్ పూర్ హట్, బోల్ పూర్ శాంతినికేతన్, బర్ధమాన్, డంకుణి, అందూల్, ఖరగ్ పూర్, భద్రక్, జాజ్ పూర్ కియొంఝర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బలుగావ్, బ్రహ్మపూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

అనంతరం పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్, కేఆర్ పురం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+