Video: 60 ఏళ్ల అవ్వను చెట్టుకు కట్టేసి ఎలా కొట్టారో చూడండి

అది హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ పల్లెటూరు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనుషుల ఆలోచనల్లో మాత్రం ఇంకా చీకటే రాజ్యమేలుతోంది. తోటి మనిషి ప్రాణాలంటే చులకనైపోయాయి. చేతబడులు చేస్తున్నారనే పిచ్చి నమ్మకంతో కొందరు గ్రామస్థులు ఓ అవ్వపై కర్కశంగా ప్రవర్తించారు. ఆమెను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టిన తీరు చూస్తే ఎవరి గుండెయినా తరుక్కుపోవాల్సిందే. మూఢనమ్మకాలు ఏకంగా మనుషులను ఎలా రాక్షసులుగా మారుస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన 60 ఏళ్ల పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధురాలిపై కొందరు గ్రామస్థులు కక్షగట్టారు. ఆమె చేతబడులు చేస్తోందంటూ ఎప్పటి నుంచో కొందరి మనసుల్లో అనుమానం గూడుకట్టుకుని ఉంది. ఈ క్రమంలో ఈనెల 23వ తేదీన గ్రామంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. స్థానికంగా ఒక మహిళకు సంబంధించిన వస్తువులతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రగిలిపోయిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో నేరుగా వెంకటమ్మ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు.

Shocking Incident in Rangareddy District Where 60 Year Old Woman Tied to Tree and Beaten Over Black Magic Rumors

వేడుకున్నా కనికరించని రాక్షసులు

ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చిన ఆ వృద్ధురాలిని గ్రామ మధ్యలో ఉన్న వేప చెట్టుకు బలవంతంగా కట్టేశారు. 'నువ్వే చేతబడులు చేస్తున్నావు, మా జీవితాలతో ఆడుకుంటున్నావు' అంటూ ఇష్టానుసారంగా దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. చేతికి దొరికిన కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ వృద్ధురాలు ప్రాధేయపడినా, కాళ్లావేళ్లా పడినా ఆ మృగాళ్ల మనసులు కరగలేదు. ఈ దాడిలో ఆమె ఎడమ చేతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతున్నా ఆపకుండా కర్కశంగా ప్రవర్తించారు.

నా కుటుంబం మొత్తాన్ని చేతబడి చేసి చంపారు - బుల్లితెర బ్యూటీ
నా కుటుంబం మొత్తాన్ని చేతబడి చేసి చంపారు - బుల్లితెర బ్యూటీ

అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి

తమ కళ్లముందే తల్లిని అలా హింసిస్తుంటే ఆపడానికి వెళ్లిన భర్త పల్లాటి పోచయ్య, కుమారుడు మహేష్‌పై కూడా ఆ మూక విరుచుకుపడింది. వారిని కూడా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా మహేష్ కారు వెనుక అద్దాలను ధ్వంసం చేసి తమ ప్రతాపం చూపించారు. కుటుంబ సభ్యులార్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, గ్రామానికి చేరుకుని స్థానికుల చెర నుంచి ఆ వృద్ధురాలిని అతికష్టం విడిపించారు. వెంటనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

నాకు చేతబడి చేశారు.. అందుకే అలా - టాలీవుడ్ స్టార్ హీరో !
నాకు చేతబడి చేశారు.. అందుకే అలా - టాలీవుడ్ స్టార్ హీరో !

చట్టం చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు: పోలీసుల హెచ్చరిక

ఈ అమానుష ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీఎం రాజు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. గ్రామానికి చెందిన మొత్తం 14 మందిపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అమాయకపు వృద్ధురాలిపై జరిగిన ఈ దాడి ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+